• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జీ20: షీ జిన్‌పింగ్‌ను చూడగానే లేచి వెళ్లి చేతులు కలిపిన మోదీ... ప్రతిపక్షాల విమర్శలు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
నరేంద్ర మోదీతో షీ జిన్ పింగ్

ఇండోనేషియాలో జరుగుతున్న జీ20 సదస్సులో పాల్గొన్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఎదురుపడ్డారు.

జీ20 సదస్సుకు వచ్చిన నేతల కోసం ఇండోనేషియా అధ్యక్షుడు జొకో విడోడో విందు ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా నరేంద్ర మోదీ, షీ జిన్‌పింగ్ కలుసుకున్నారు. కాసేపు మాట్లాడుకున్నారు.

ఈ సదస్సుల్లో చైనా, భారత్ దేశాధినేతల మధ్య అధికారిక సమావేశాలు అయితే లేవు.

2020లో గాల్వాన్ వద్ద భారత, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణల తరువాత మోదీ, షీ జిన్‌పింగ్ కలుసుకోవడం ఇదే తొలిసారి. ఇంతకు ముందు షాంఘై సమిట్‌లో ఇద్దరు పాల్గొన్న వ్యక్తిగతంగా కలుసుకోలేదు.

https://twitter.com/INCIndia/status/1592549644848214017?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1592549644848214017%7Ctwgr%5E2e5b200208f131daf989bf35ff24fdaebffb638d%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.bbc.com%2Fhindi%2Findia-63645108

గాల్వాన్‌తోపాటు ఇతర సరిహద్దుల్లో భారత్ భూమిని చైనా ఆక్రమిస్తోందంటూ ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ, తాజాగా షీ జిన్‌పింగ్‌ను మోదీ కలుసుకోవడాన్ని విమర్శించింది.

గాల్వాన్ ఘర్షణలు, చైనా 'ఆక్రమణల’ మీద నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎప్పుడూ విమర్శిస్తూ ఉంటారు.

తాజాగా మోదీ, షీ జిన్‌పింగ్ కలుసుకున్న వీడియోను కాంగ్రెస్ పార్టీ షేర్ చేయడంతోపాటు గల్వాన్ ఘర్షణల్లో చనిపోయిన వారి పేర్లను కూడా ట్వీట్ చేసింది.

కూర్చొని ఉన్న నరేంద్ర మోదీ, షీ జిన్‌పింగ్ కనబడగానే లేచి ఆయనతో కరచాలనం చేశారు. ఆ తరువాత కాసేపు మాట్లాడారు. ఇండోనేషియా అధ్యక్ష కార్యాలయం యూట్యూబ్ చానెల్‌లో ఆ దృశ్యాలు కనిపించాయి.

https://twitter.com/asadowaisi/status/1592563714645200896?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1592563714645200896%7Ctwgr%5E2e5b200208f131daf989bf35ff24fdaebffb638d%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.bbc.com%2Fhindi%2Findia-63645108

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ దీన్ని విమర్శించారు. 'సర్, కళ్లు ఎర్ర చేయలేదే?’ అంటూ ట్వీట్ చేశారు.

https://twitter.com/VineetPunia/status/1592735712692305922?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1592735712692305922%7Ctwgr%5E2e5b200208f131daf989bf35ff24fdaebffb638d%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.bbc.com%2Fhindi%2Findia-63645108

కాంగ్రెస్ నేత వినీత్ పునియా కూడా ఆ వీడియోను షేర్ చేశారు.

'కళ్లు ఎర్రజేస్తానని గతంలో అన్నారు. రెండేళ్ల నుంచి చైనా మన భూభాగాన్ని ఆక్రమించి కూర్చొని ఉంది. మరి ఇక్కడ నిలబడి అభినందనలు ఎందుకు చెబుతున్నట్లు?’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

https://twitter.com/srinivasiyc/status/1592721254536347650?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1592721254536347650%7Ctwgr%5E2e5b200208f131daf989bf35ff24fdaebffb638d%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.bbc.com%2Fhindi%2Findia-63645108

'నోరు లేయాల్సిన చోట... ఆయనే లేచి వెళ్లారు.

కళ్లు ఎర్ర చేయాల్సిన చోట... ఎర్రని కుర్తాను చూపించారు.

మోదీ మాటలు, చేతలు 19 సెకండ్లలో చూడొచ్చు’ అంటూ ఇండియన్ యూత్ కాంగ్రెస్ నేషనల్ ప్రెసిడెంట్ బీవీ శ్రీనివాస్ ట్వీట్ చేశారు.

https://twitter.com/yuva_rajad/status/1592757237902381057?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1592757237902381057%7Ctwgr%5E2e5b200208f131daf989bf35ff24fdaebffb638d%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.bbc.com%2Fhindi%2Findia-63645108

మోదీ, షీ జిన్‌పింగ్‌లు చేతులు కలపడాన్ని ఆర్జేడీ యూత్ వింగ్ కూడా విమర్శించింది.

గాల్వాన్ లోయలో భారత, చైనా సైనికుల మధ్య ఘర్షణ

గల్వాన్‌లో ఏం జరిగింది?

2020 మే 1న గాల్వాన్ సరిహద్దు వద్ద చైనా, భారత్ సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రెండు వైపులా సైనికులు గాయపడ్డారు. ఆ తరువాత జూన్ 15న మరొకసారి ఘర్షణ జరిగింది.

ఈ ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు చనిపోయారు. చనిపోయిన తమ సైనికుల వివరాలను చైనా ముందు వెళ్లడించనప్పటికీ ఆ తరువాత నలుగురు చనిపోయినట్లు ప్రకటించింది.

కానీ అంతకంటే ఎక్కువ మందే చనిపోయారని భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు.

గాల్వాన్ ఘర్షణ తరువాత నరేంద్ర మోదీ మాట్లాడారు. సైనికుల త్యాగం ఊరికే పోదు అని అన్నారు. కానీ చైనా పేరు మాత్రం ఆయన ప్రస్తావించలేదు. నాడు ఆ తీరును ప్రతిపక్షాలు విమర్శించాయి.

లేహ్‌ను సందర్శించి అక్కడ సైనికులను ఉద్దేశించి కూడా మోదీ మాట్లాడారు. చాలా సందర్భాల్లో సరిహద్దు ఆక్రమణలను భారత్ సహించదని ఆయన స్పష్టం చేశారు.

గాల్వాన్ ఘర్షణల నేపథ్యంలో రెండు దేశాలకు చెందిన సైనిక అధికారులు చర్చలు ప్రారంభించారు. విదేశాంగ మంత్రి జై శంకర్, చైనా విదేశాంగ మంత్రితో ఫోన్‌లో మాట్లాడారు.

దాదాపు రెండేళ్ల పాటు సాగిన చర్చల తరువాత గాల్వాన్‌లో ఉద్రిక్తతలు కాస్త సద్దుమణిగాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
G20: Modi got up and joined hands on seeing Xi Jinping... Criticized by the opposition
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X