G20 summit: స్పెషల్ మొబైల్ పోలీస్ స్టేషన్- బస్సులోనే ఎఫ్ఐఆర్
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల్లో అత్యున్నత భేటీల్లో ఒకటిగా భావించే జీ20 హై ప్రొఫైల్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. దీనికి సంబంధించిన కోలాహలం దేశంలో నెలకొంది. దేశ రాజధానిలో 8, 9,10 తేదీల్లో ఈ సమ్మిట్ జరుగబోతోంది. దీనికోసం ఢిల్లీ ముస్తాబైంది. నగరంలోని ప్రఖ్యాత కట్టడాలన్నింటినీ మువ్వన్నెల వెలుగులతో అలంకరించారు.
జీ20లో భారత్ సహా అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్, అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు ఇందులో సభ్యులుగా కొనసాగుతున్నాయి. ఆయా దేశాల ప్రతినిధులందరూ వచ్చే సంవత్సరం భారత్‌లో జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సుకు హాజరు కావాల్సి ఉంది.

కాగా- ఈ సదస్సు ఏర్పాటైన నేపథ్యంలో ఢిల్లీ భద్రత మొత్తం అత్యంత కట్టుదిట్టంగా మారింది. ప్రత్యేకించి ఈ సదస్సు జరిగే ప్రగతి మైదాన్ పరిసరాల్లో కనివినీ ఎరుగని సెక్యూరిటీ వ్యవస్థను మోహరింపజేశారు. అయిదంచెల భద్రతను ఏర్పాటు చేశారు. సదస్సు ముగిసేంత వరకూ 24 గంటల పాటు ఈ భద్రత వ్యవస్థ కొనసాగుతుంది.
ప్రస్తుతం ఢిల్లీ నగరం మొత్తం పోలీసులు, భద్రత బలగాల గుప్పిట్లో ఉంది. రోజువారీ కార్యకలాపాలను సాగించడానికి పోలీస్ స్టేషన్లల్లోతగినంత సిబ్బంది అందుబాటులో ఉండట్లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలను చేపట్టారు.
#WATCH | Delhi: Central Delhi Police launches Mobile Police Station ahead of G20 summit. pic.twitter.com/8pWQCiEghE
— ANI (@ANI) September 7, 2023
సెంట్రల్ ఢిల్లీ కమిషనర్ కార్యాలయం పరిధిలో ప్రత్యేకంగా మొబైల్ పోలీస్ స్టేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒక పోలీస్ వాహనంలో ఇది ఏర్పాటైంది. సెంట్రల్ కమిషనరేట్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో తిరుగాడుతోంది. స్థానికులు తమ ఫిర్యాదులను నమోదు చేయించడానికి ఈ మొబైల్ పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేయాల్సి ఉంటుంది.
ఒక పోలీస్ స్టేషన్‌లో రోజువారీ విధులు ఎలా ఉంటాయో.. ఇందులోనూ అలాగే కొనసాగుతాయి. జీ20 సమ్మిట్ ముగిసి, భద్రత విధుల్లో తలమునకలైన ఉన్న పోలీసులు మళ్లీ రోజువారీ విధుల్లో పాల్గొనేంత వరకూ ఈ మొబైల్ పోలీస్ స్టేషన్ ప్రజలకు అందుబాటలోనే ఉంటుందని కమిషనర్ తెలిపారు.












Click it and Unblock the Notifications