గాలి జనార్ధన్ రెడ్డి కేసు: అలీకి బెయిల్ మంజూరు, విడుదల
హైదరాబాద్: ఓబుళాపురం మైనింగ్ కేసులో మరో నిందితుడికి బుధవారం నాడు బెయిల్ లభించింది. కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి పీఏ అలీఖాన్‌కు బెయిల్ మంజూరైంది. బెయిల్ లభించడంతో ఆయన బెంగళూరు జైలు నుండి విడుదలయ్యారు.
కాగా, ఓఎంసీ కేసులో గాలి జనార్ధన్ రెడ్డి ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. సుమారు నాలుగు సంవత్సరాల తర్వాత గాలి జనార్ధన్ రెడ్డికి కొద్ది రోజుల క్రితం బెయిల్ మంజూరైంది. బెయిల్ మంజూరు చేస్తే అభ్యంతరం లేదని సిబిఐ సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే గాలికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
బళ్లారికి వెళ్లరాదని, విదేశాలకు పోకూడదని సుప్రీంకోర్టు గాలి జనార్ధన్ రెడ్డికి షరతులు విధించింది. ఆయన తన పాస్‌పోర్ట్‌ను అప్పగించాలని సూచించింది. బెయిల్ మంజూరు చేసిన కోర్టు రూ. 30లక్షల పూచీకత్తు సమర్పించాలని గాలిని ఆదేశించింది.

ఓఎంసీ కేసులో గాలి 2011 సెప్టెంబర్ 4న అరెస్టు అయ్యారు. మొత్తం ఏడు కేసుల్లో బెయిల్ లభించడంతో గాలి ఇక బయటకు రానున్నారు. గాలి ప్రస్తుతం పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు.
ఓఎంసీ కేసులో గాలి గత కొంత కాలం నుంచి జైలు జీవితం గడుపుతున్న విషయం తెలిసిందే. గాలికి బెయిల్ మంజూరైన నేపథ్యంలో ఆయన అనుచరులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో తొలిసారి బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలో గాలి జనార్ధన్ రెడ్డి మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications