ఎఎంసి కేసులో గాలికి బెయిల్: అయినా జైల్లోనే

ఓఎంసి కేసులో బెయిల్ రానందున గాలి జనార్దన్ రెడ్డి జైల్లోనే ఉండాల్సి వస్తుంది. గాలి జనార్దన్ రెడ్డి 2012 సెప్టెంబర్ నుంచి జైలులో ఉంటున్నారు. తొలుత ఓఎంసి కేసులో ఆయనను సిబిఐ అరెస్టు చేసి హైదరాబాదుకు తీసుకుని వచ్చింది. దీంతో గాలి జనార్దన్ రెడ్డిని త్వరలో హైదరాబాద్ తరలించే అవకాశాలున్నాయి. మరో మూడు నెలల వరకు బెయిల్ పిటిషన్ వేయరాదని సుప్రీంకోర్టు గాలి జనార్దన్ రెడ్డిని ఆదేశించింది. దీంతో ఓఎంసి కేసులో ఆయన బెయిల్ పిటిషన్ దాఖలున చేసే అవకాశాలు సమీప కాలంలో లేవు.
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి భార్య అరుణ లక్ష్మి పేరు మీద ఉన్న అసోసియేటెడ్ మైనింగ్ కంపెనీ (ఎఎంసి)పై సిబిఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గనుల అక్రమ తవ్వకాల కేసులో ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. మొత్తం 21 మందిపై సిబిఐ ఎఫ్ఐఆర్ శనివారం దాఖలు చేసినట్లు తెలుస్తోంది. బెంగుళూర్‌లో డిజిగ్నేటెడ్ కోర్టులో ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు సమాచారం.
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి)కేసులో ఎఫ్ఐర్ దాఖలు చేసిన నెల రోజులు తర్వాత అసోసియేటెడ్ మైనింగ్ కంపెనీపై ఎఫ్ఐఆర్ దాఖలైంది. గనుల అక్రమ తవ్వకాలపై 2012 సెప్టెంబర్ మొదటివారంలో సిబిఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, గాలి జనార్దన్ రెడ్డిని, బివి శ్రీనివాస రెడ్డిని అరెస్టు చేశారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications