గాంధీజీ, అంబేద్కర్ మధ్య గొడవలు ఏంటి? బౌద్ధమతంలోకి ఎందుకు మారారు? జై భీమ్ నినాదం ఎలా పుట్టింది?
భారతదేశంలోని గొప్ప నాయకుల్లో మహాత్మాగాంధీ, బాబా సాహెబ్ అంబేద్కర్ ముఖ్యులు. ఒకరు తన అహింసావాదంతో భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషిస్తే.. ఇంకొకరు ఆ స్వాతంత్ర్యం తర్వాత దేశాన్ని ప్రజాస్వామ్య బద్ధంగా నడపడానికి రాజ్యాంగాన్ని రచించినవారు. అంబేద్కర్ చిన్నప్పటి నుంచి నువ్వు దళితుడివి.. అంటరానివాడిని అని చిన్నప్పటి నుంచి సమాజంలో చిన్నచూపుకు గురై పెరిగారు. మరోవైపు గాంధీజీ సనాతన హిందూ ధర్మాలను పాటిస్తూ ఇతర మతాలవాళ్లను కూడా గౌరవిస్తూ నడిచారు. ఇలాంటి విభిన్న ధృవాల మధ్య ఎందుకు వివాదాలు చెలరేగాయి? గాంధీజిని అంబేద్కర్ మొదటిసారి ఎప్పుడు కలిశారు? కులం విషయంలో ఇద్దరి మధ్య ఉన్న అభిప్రాయ బేధాలు ఏంటి?
అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న మహారాష్ట్రలోని మహర్ కులంలో జన్మించారు. ఈ కులం దళిత వర్గాల్లోనే అత్యంత నిమ్నకులం. దీంతో ఆయన చిన్నప్పటి నుంచే ఎన్నో వివక్షలు, అవమానాలను భరిస్తూ పెరిగారు. అంబేద్కర్.. ఆయన అన్న స్కూలుకు వెళ్లినప్పుడు వాళ్లు సెపరేట్ గా కూర్చోడానికి ఓ ఇటుక తీసుకుని వెళ్లేవారు. అంతేకాక పాఠశాలలో అందరు పిల్లలు తాగే నీటిని తాగకూడదని నిబంధనలు పెట్టారు. వారికోసం ప్రత్యేకంగా ఓ కుండను పెట్టారు. అది కూడా ఓ ప్యూన్ వచ్చి నీళ్లను దోసిట్లో పోసేవారు. గ్లాస్ తో ఇచ్చేవారు కాదు. ఏరోజైనా ప్యూన్ రాకపోతే ఆరోజు దాహంతో అలా ఉండాల్సి వచ్చేది. ఇలాంటి విపత్కర పరిస్థితుల మధ్య అంబేద్కర్ తన విద్యాభ్యాసాన్ని కొనసాగించారు.

ఆ తర్వాత ఉన్నత చదువులకోసం భరోజా సంస్థానం నుంచి ఆయనకు స్కాలర్ షిప్ లభించింది. ఆ స్కాలర్ షిప్ తోనే ఆయన కొలంబియా యూనివర్సిటీలో చదువుకున్నారు. ఆ తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్ నుంచి డాక్టరేట్ ను కూడా పొందారు. ఎంత ఉన్నత చదువులు చదువుకున్నా అంబేద్కర్ నిమ్నకులానికి చెందినవాడంటూ ఎన్నో దూషణలను ఎదుర్కొన్నారు. దీంతో ఆయనకు కులతత్వం అంటేనే విరక్తి కలిగింది. తన రచనల్లో ఓపెన్ గానే ఆయన హిందూ ధర్మాన్ని విమర్శించేవారు.
మరోవైపు మహాత్మాగాంధీ ఓ సనాతన హిందువు. ఆయన భావనలు, అభిప్రాయాలు హిందూధర్మం నుంచి వచ్చినవే. ఆయన తన మతాలను గౌరవిస్తూనే ఇతర మతాలనూ గౌరవించేవారు. మతాల మధ్య సామరస్యం ఉండాలని గాంధీజీ ఎప్పుడూ భావించేవారు. ఆయన కులం అనేది హిందూ ధర్మంలో ఓ భాగం అని అనుకునేవారు. అంతేకాక అంటరానితనం అనేది హిందూధర్మంలో భాగం కాదని అది మహాపాపం అని గాంధీజీ అభిప్రాయపడేవారు. అంటరాని తనాన్ని రూపు మాపేందుకు 1932లో హరిజన సేవక్ సంఘ్ అనే సంఘాన్ని స్థాపించారు. ఈ సంఘం ద్వారా హరిజనులకు దేవాలయ ప్రవేశాలు, సహపంక్తి భోజనాలు నిర్వహించేవారు. ఇలా గాంధీజీ, అంబేద్కర్ ల ఐడియాలజీ వేరువేరుగా ఉండేది.
గాంధీజీ, అంబేద్కర్ మధ్య వివాదాలు..?
గాంధీజీ, అంబేద్కర్ మధ్య వివాదాలు రావడానికి గల ముఖ్యమైన కారణం.. అంబేద్కర్ ప్రతిపాదించిన సెపరేట్ ఎలక్టోరేట్. అంటే ఒక వర్గానికి ఎక్కువ ప్రాతినిథ్యం ఉన్నచోట ఆ వర్గం వాళ్లే పోటీ చేయాలన్న నిబంధన. సాధారణంగా అయితే ఎవరైనా ఎక్కడైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. వారికి ఎవరైనా ఓటు వేయొచ్చు. అదే రిజర్వ్ డ్ ఎన్నికల ప్రక్రియ అయితే ఏదైనా ఓ వర్గం వాళ్లు పోటీ చేస్తే.. పోటీ చేసినవాళ్లు మాత్రమే ఎన్నికల్లో ఓటు వేయాలి. ఇదే సమయంలో అంబేద్కర్.. హిందువుల్లో ఉన్న దళితులకు కూడా సెపరేట్ ఎలక్టోరేట్ ఉండాలని వాదించారు. అంటరానికులాలకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రావాలని, ప్రభుత్వాల్లో వారికి సరైన ప్రాతినిథ్యం ఉండాలని వాదించారు. 1927లో సైమన్ కమిషన్ ముందు.. 1930-32 మధ్య రౌండ్ టేబుల్ సమావేశాల్లోనూ ఆయన అదే అంశంపై బ్రిటిష్ ప్రభుత్వం ముందు వాదనలు వినిపించారు.

అయితే అంబేద్కర్ ప్రతిపాదనలను గాంధీజీ తీవ్రంగా వ్యతిరేకించారు. వీరిద్దరి మధ్య ఈ విషయంపైనే తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. అంటరానివారికి సెపరేట్ ఓటింగ్ అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఇది కులాల మధ్య చిచ్చుగా మారుతుందన్నారు. ఇది దేశాన్ని ముక్కలు చేయడమే అవుంతుందని గాంధీజీ తెలిపారు.
బౌద్ధమతంలోకి..
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 1956 అక్టోబర్ 14న మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో లక్షల మంది అనుచరులతో కలిసి బౌద్ధ మతాన్ని స్వీకరించారు. నాగ్‌పూర్ దీక్షభూమిలో బౌద్ధమతాన్ని స్వీకరిస్తూ అంబేద్కర్.. తన అనుచరులతో కలిసి 22 ప్రతిజ్ఞలను చేశారు. అయితే అంబేద్కర్ చేసిన ఈ 22 ప్రతిజ్ఞలతో చాలా మంది హిందువులు తమ మనోభావాలు దెబ్బతిన్నాయన్న ఆరోపణలూ వచ్చాయి.

జై భీమ్ నినాదం..
ఉత్తర్ ప్రదేశ్, బిహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లాంటి హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో 'జై భీమ్' నినాదం ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అంబేద్కర్ ఆలోచనలు పంజాబ్‌లో కూడా విస్తరించాయి. పంజాబ్ లో 'జై భీమ్- జై భీమ్, బోలో జై భీమ్' అంటూ పాటలు కూడా వినిపిస్తాయి. అయితే జై భీమ్ అని ఎందుకు అంటారంటే.. బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు భీమ్ రావ్ రామ్ జీ అంబేద్కర్. ఆయన పేరును సంక్షిప్త రూపంలో పిలుచుకునే విధానం మొదట్లో మహారాష్ట్రలో ఉండేది. క్రమంగా భారత దేశమంతటా పాకింది. అలా ఆయన నిక్ నేమ్ గా జై భీమ్ అనే పదం వాడుకలోకి వచ్చింది.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications