Ganesh Chaturthi: గణేష్ చతుర్థి 2025 ఎప్పుడు..? విగ్రహ ప్రతిష్టకు శుభ ముహూర్తం..?
వినాయక చవితి వచ్చిందంటే చాలు ఊరు వాడా అని తేడా లేకుండా గణేష్ విగ్రహాలు కనిపిస్తుంటారు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా ఈ పండుగను 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. సిటీ అయినా గ్రామాలైన ప్రతి గల్లీలో గణేష్ మండపాలు దర్శనం ఇస్తుంటాయి. మరికొంత మంది ఇళ్లలోనే విగ్రహాలు పెట్టి పూజలు నిర్వహిస్తుంటారు. ఇక భాద్రపద మాసంలో వినాయక చవితి పండుగ వస్తుంది. ఆగస్టు 27వ తేదీ నుంచి గణేష్ నవ రాత్రులు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 6 వరకు దేశ వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు జరగనున్నాయి. అలా 10 రోజుల పాటు చిన్నా పెద్ద, పేద ధనిక అనే తేడా లేకుండా వైభవంగా ఈ వినాయక చవితి పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు.
వినాయక చవితి 2025 ఆగస్టు 27న ప్రారంభం కానుంది. ఆగస్టు 27న విగ్రహ ప్రతిష్టతో నవరాత్రులు ప్రారంభం అవుతాయి. ఈ మేరకు వినాయక చవితి రోజు గణేశుని విగ్రహ పత్రిష్టాపనకు ఉదయం 11:05 గంటల నుంచి మధ్యాహ్నం 01:40 గంటల వరకు అనువైనదిగా పురోహితులు చెబుతున్నారు. ఈ రెండు గంటల 34 నిమిషాల వ్యవధిలో ఎప్పుడైనా విగ్రహ ప్రతిష్ట చేసుకోవచ్చని తెలిపారు.
అయితే మధ్యాహ్న పూజ టైమింగ్స్ ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉన్నాయి. ముంబైలో ఉదయం 11:24 గంటల నుంచి మధ్యాహ్నం 01:55 గంటల వరకు ముహూర్తం ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. అలాగే పుణెలో ఉదయం 11:21 గంటల నుంచి మధ్యాహ్నం 01:51 గంటల వరకు, చెన్నైలో ఉదయం 10:56 గంటల నుంచి మధ్యాహ్నం 01:25 గంటల వరకు, కోల్ కతాలో ఉదయం 10:22 గంటల నుంచి మధ్యాహ్నం 12:54 గంటల వరకు, బెంగళూరులో ఉదయం 11:07 గంటల నుంచి మధ్యాహ్నం 01:36 గంటల వరకు ఉందని పేర్కొన్నారు.

ఈ విగ్రహ ప్రతిష్ట అనంతం.. గణేష్ పూజను నియమ, నిష్టలతో చేయడం వల్ల దేవుని అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఇక వినాయకుడిని పర్యావరణ హితమైన మట్టి వినాయకుడిని ప్రతిష్టించుకోవడం ఎంతో శ్రేయస్కరం అని పురోహితులు, పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఇక గణేశునికి 9 రోజులపాటు అంగరంగ వైభవంగా పూజ అనంతరం సెప్టెంబర్ 6, శనివారం నాడు గణేష్ నిమజ్జనం ఉంటుంది.












Click it and Unblock the Notifications