యువకుడిపై కారులో సామూహిక అత్యాచారం.. నలుగురు అమ్మాయిలు రెచ్చిపోయి.. రేప్ సీన్ రివర్స్!!
ఇంతకుముందు వరకు అత్యాచారాలు చేయడం మగవారికే పరిమితమని అందరూ అనుకున్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళు శారీరక హింసకు గురవుతున్నారని మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు కూడా తీసుకువచ్చారు. అయితే లైంగిక దాడులలో మేము కూడా తగ్గేదే లేదని ఇటీవల కొందరు యువతులు అందరినీ షాక్ కి గురి చేస్తున్నారు. కొందరు ఆడవాళ్ళు కూడా ఇప్పుడు అత్యాచారాల బాటపట్టారు.

పంజాబ్ జలంధర్ లో దారుణం.. యువకుడి సామూహిక అత్యాచారం
తప్పా ఒప్పా అన్నది పక్కన పెడితే తమ లైంగిక వాంఛ తీర్చుకోవడమే లక్ష్యంగా మగవాళ్ళ పై ఆడవాళ్ళ కూడా అనేక దారుణాలకు పాల్పడుతున్న పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. తాజాగా రోడ్డు మీద వెళ్లే యువకుడిని అపహరించి నలుగురు యువతులు అత్యాచారం చేసిన ఘటన చోటుచేసుకోవడం అందరిని ఒకింత షాక్ కు గురి చేస్తుంది. రేప్ సీన్ రివర్స్ కావటం అవాక్కయ్యేలా చేసింది. ఇంతకు ఏం జరిగిందంటే.. పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ లో నలుగురు అమ్మాయిలు ఓ యువకుడిని అపహరించి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన జలంధర్ కపూర్తలా ప్రాంతంలో లెదర్ కాంప్లెక్స్ రోడ్డులో చోటుచేసుకుంది.

కారులో ఎక్కించుకుని అత్యాచారానికి పాల్పడిన యువతులు
బాధితుని కథనం ప్రకారం లెదర్ కాంప్లెక్స్ రోడ్లో ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్న యువకుడు మధ్యాహ్నం పని ముగించుకుని ఇంటికి వెళుతున్న క్రమంలో అతని పక్కగా రోడ్డుపై ఓ కారు ఆగిందని, కారులో ప్రయాణం చేస్తున్న నలుగురు అమ్మాయిలు అతనిని ఓ అడ్రెస్ అడిగారని తెలిపాడు. ఇక అడ్రస్సు చెప్పడానికి అతనిని కారులో ఎక్కించుకున్నారని చెబుతున్నాడు. ఆ తరువాత నలుగురు యువతులు కారులోనే ఒకరి తర్వాత ఒకరు తనపై లైంగిక అత్యాచారానికి పాల్పడ్డారని యువకుడు చెబుతున్నాడు. ఆ తర్వాత వారు కారు నుండి అతడిని దించి వెళ్లిపోయారని చెప్తున్నాడు.

ఆడవాళ్లకే కాదు మగవారికీ రక్షణ కరువేనా... ఇది నిజమేనా?
కారులో తిప్పుతూ తనపై లైంగిక దాడికి పాల్పడిన నలుగురు యువతుల వయసు 22 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల మధ్య ఉంటుందని యువకుడు పేర్కొన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి పోలీస్ కేసు ఇప్పటి వరకు నమోదు కాలేదు. కానీ సదరు యువకుడు చెప్పినదాన్ని బట్టి ఇప్పుడు రోడ్డుమీద వెళ్లే ఆడవాళ్ళకే కాదు, మగవాళ్ళ కూడా రక్షణ లేకుండా పోయింది అది చర్చ ఆసక్తికరంగా మారింది. అమ్మాయిలు కూడా ఈ విధంగా బరితెగించి లైంగిక దాడులకు పాల్పడడం ప్రస్తుతం సమాజాన్ని ఆలోచించేలా చేస్తోంది. అయితే ఈ ఆరోపణలో వాస్తవం ఉందా? లేదా అనేది పోలీసులు దర్యాప్తు చేస్తేనే తెలిసే అవకాశం ఉంటుంది.












Click it and Unblock the Notifications