కెమెరాల ముందే గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ హత్య, పోలీసులు ఏం చెప్పారు?
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మాజీ ఎంపీ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌పై కాల్పులు జరిపి హత్య చేశారు.
అతిక్ అహ్మద్, అతని సోదరుడి హత్యను పోలీసులు ధృవీకరించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దాడికి పాల్పడిన వారు జర్నలిస్టుల వేషధారణలో వచ్చారు. కెమెరాల ముందే వీరిని దుండగులు హత్య చేశారు. ఈ దాడికి పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేశారు.
కాగా, ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సంఘటనపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
ప్రయాగ్‌రాజ్‌లో అతిక్, అష్రఫ్ అహ్మద్‌ల దారుణ హత్య నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతి, భద్రతలను పరిరక్షించాలని యూపీ పోలీసులకు యోగి ఆదిత్యనాథ్ సూచించారు.
అంతేకాక, ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు కూడా యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు.
దీన్ని విచారించేందుకు ముగ్గురు సభ్యుల జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు చేశారు.
https://twitter.com/ANI/status/1647359360736329728

వైద్య పరీక్షల కోసం అతిక్, అష్రఫ్ అహ్మద్‌లను ఆస్పత్రికి తీసుకెళ్తున్న సమయంలో ఈ సంఘటన జరిగినట్లు ప్రయాగ్‌రాజ్ పోలీసు కమిషనర్ రమిత్ శర్మ తెలిపారు.
కాల్పులకు పాల్పడ్డ వారు జర్నలిస్ట్‌ల మాదిరి వచ్చి, అతిక్, అష్రఫ్‌లను అతి సమీపం నుంచి కాల్చారని ఆయన వెల్లడించారు.
దుండగులను వెంటనే పోలీసులు చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు.
ఆస్పత్రికి దగ్గర్లోనే ఈ సంఘటన జరిగింది. వీరి మరణం తర్వాత పెద్ద ఎత్తున మతపరమైన నినాదాలు వినిపించాయి.
''అతిక్ అహ్మద్, ఆయన సోదరుడితో ఒక జర్నలిస్ట్ మాట్లాడుతున్న సమయంలో, జర్నలిస్ట్‌ల మాదిరిగా వచ్చిన దుండగులు ఈ కాల్పులు జరిపారు. కాల్పులకు పాల్పడ్డ ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నాం’’ అని రమిత్ శర్మ తెలిపారు.
ఈ సంఘటనలో కొందరు పోలీసులకు, జర్నలిస్ట్‌కు కూడా గాయాలయ్యాయి.
అతిక్ అహ్మద్, అష్రఫ్‌ల హత్య తర్వాత ఆస్పత్రి చుట్టుపక్కల ప్రాంతం మొత్తాన్ని బ్లాక్ చేశారు.
(ఈ వార్త అప్ డేట్ అవుతోంది)
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్: హుస్సేన్ సాగర్‌లో బుద్ధ విగ్రహం మునిగిపోయినప్పుడు ఏం జరిగింది?
- మారుమూల దీవిలో ఆ వింత రాళ్లు ఎలా ఏర్పడ్డాయి? అక్కడేం జరుగుతోంది?
- జలియన్‌వాలా బాగ్ మారణహోమం: సరిగ్గా 104 ఏళ్ల కిందట ఈ రోజున అసలేం జరిగింది
- విశాఖ స్టీల్ ప్లాంట్‌ను తెలంగాణ ప్రభుత్వం కొనగలదా? నిబంధనలు ఏం చెబుతున్నాయి?
- పుష్ప: అంధులు, వికలాంగుల కోసం ఉచితంగా వెయ్యి పరీక్షలు రాసిన మహిళ కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












Click it and Unblock the Notifications