Adani: అదానీతో పాటు అల్లుడికీ మరో బిగ్ షాక్-అమెరికా నుంచి తాజా సమన్లు..!

భారత్ లో సౌరశక్తి కాంట్రాక్టుల కోసం ఇక్కడి ప్రభుత్వాలకు 2 వేల కోట్ల మేర ముడుపులు చెల్లించిన వ్యవహారంలో అమెరికా కోర్టులో విచారణ ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్ అధినేత గౌతం అదానీతో పాటు ఆయన మేనల్లుడు సాగర్ అదానీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత నెలల్లో అమెరికా కోర్టు నమోదు చేసిన నేరాభియోగాలతో పాటు అరెస్టు వారెంట్ ను తాత్కాలికంగా నిలిపివేసిన నేపథ్యంలో ఊరట లభించిందని భావిస్తున్న తరుణంలో మరో షాక్ తగిలింది.

భారత్ లో సోలార్ పవర్ కాంట్రాక్టులను దక్కించుకునేందుకు 265 మిలియన్ డాలర్లను లంచంగా ఇచ్చారనే ఆరోపణలపై అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ తాజాగా గౌతం అదానీకీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీకి నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో తమ వైఖరిని వివరించడానికి వీరిద్దరికీ సమన్లు జారీ చేశారు. ఈ మేరకు అహ్మదాబాద్‌లోని అదానీ శాంతివాన్ ఫార్మ్ నివాసానికి, అలాగే సాగర్ అదానీ బోడక్‌దేవ్ నివాసానికి వీటిని పంపారు.

Gautam adani and nephew sagar adani get summons from US Securities and Exchange commission

21 రోజుల్లోగా అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ కు సమాధానం ఇవ్వాలని ఈ సమన్లలో పేర్కొన్నారు. నవంబర్ 21న ఈ సమన్లు న్యూయార్క్ కోర్టు ద్వారా జారీ అయ్యాయి. ఈ సమన్లకు ప్రతిస్పందించడంలో విఫలమైతే ఫిర్యాదులో కోరిన ఉపశమనం కోసం డిఫాల్ట్‌గా తీర్పు వీరికి వ్యతిరేకంగా జారీ అవుతుందని కూడా కోర్టు పేర్కొంది. అలాగే వీరు తమ సమాధానం లేదా మోషన్‌ను కూడా కోర్టులో దాఖలు చేయాలని అందులో వెల్లడించింది. దీనిపై గౌతం అదానీ, సాగర్ అదానీ స్పందించాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+