అమర జవాన్ల పిల్లల బాధ్యత నాదే: గొప్ప మనసు చాటుకున్న గంభీర్

Subscribe to Oneindia Telugu

కోల్‌కతా: భారత స్టార్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఛత్తీస్‌గఢ్‌ మావోయిస్టుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్ల పిల్లలకు అండగా తానుంటానని గంభీర్ చెప్పాడు. అమరుల పిల్లల చదువులకు అయ్యే పూర్తి ఖర్చును తాను భరించనున్నట్లు ప్రకటించాడు.

దీనికి సంబంధించి తన గౌతమ్‌ గంభీర్‌ ఫౌండేషన్‌ ద్వారా ఇప్పటికే చర్యలు మొదలు పెట్టినట్లు తెలిపాడు. జవాన్ల ఊచకోత, పత్రికల్లో వచ్చిన వారి కుమార్తెల చిత్రాలు తనను కలచివేశాయని గంభీర్‌ చెప్పాడు.

'నా దేశ ప్రజల ప్రాణాలు విలువలేనివి కావు': మావో దాడిపై గంభీర్ తీవ్ర స్పందన

 Gautam Gambhir pledges to bear expenses of Sukma martyrs' children

'అమరుల పిల్లల చదువులకు అయ్యే పూర్తి ఖర్చును గౌతమ్‌ గంభీర్‌ ఫౌండేషన్‌ భరిస్తుంది. ఈ విషయంలో మా బృందం ఇప్పటికే పని ఆరంభించింది. దీనిపై పురోగతిని త్వరలోనే వెల్లడిస్తా' అని గంభీర్ వివరించాడు.

అంతేగాక, మావోల హత్యాకాండను నిరసిస్తూ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా నల్ల రంగు బ్యాడ్జీని ధరించాడు. సుకుమా జిల్లాలో మావోయిస్టుల జరిపిన దాడిలో 25మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన  విషయంతెలిసిందే.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Gautam Gambhir the skipper of the Kolkata Knight Riders pledged to bear all the expenses of the children of the 25 CRPF personnel who were killed in a naxal attack at Chhattisgarh on Monday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి