Gay Marriage: కోల్‌కతాలో ఒక్కటైన స్వలింగ సంపర్కులు.. వైరల్ అయిన ఫొటోలు..
కోల్‌కతాకు చెందిన ఇద్దరు గేలు(స్వలింగ సంపర్కులు) వివాహం చేసుకున్నారు. జూలై 3 ఆదివారం నాడు జరిగిన వివాహ వేడుకలో వారిద్దరు ఒకటయ్యారు. అభిషేక్ రే, చైతన్య శర్మల వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. వారి కలల పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రే సంప్రదాయ బెంగాలీ వరుడిలా దుస్తులు ధరించి, ధోతీ-కుర్తా ధరించగా, చైతన్య షేర్వాణీని ధరించాడు.
అభిషేక్ రే ఫ్యాషన్ డిజైనర్ కాగా, చైతన్య శర్మ గురుగ్రామ్‌లో డిజిటల్ మార్కెటర్‌గా పనిచేస్తున్నారు. వీరిద్దరి హల్దీ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేరు చేశారు.
ఫొటోలు వైరల్
ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతోన్నాయి. వీరి వివాహ వేడుకలకు సంబంధించి వెడ్డింగ్ ప్లానర్ ఒక రీల్‌ను ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. రీల్‌కి వేలల్లో వ్యూస్ వచ్చాయి.రీల్ పై నెజన్లు భిన్నంగా స్పందించారు. వావ్ వివాహిత జంటలకు అభినందనలు అని ఒకరు.ప్రేమలో ఉన్న ఈ కొత్త జంటకు హృదయపూర్వక అభినందనలు మరొకరు రాసుకొచ్చారు.

హైదరాబాద్ లోనూ
ఇంతకుముందు హైదరాబాద్‌కు చెందిన స్వలింగ జంట మొట్టమొదటి స్వలింగ వివాహం చేసుకున్నారు. 34 ఏళ్ల అభయ్ డాంగే, 31 ఏళ్ల సుప్రియో చక్రవర్తి ఎనిమిదేళ్ల పాటు డేటింగ్ చేశారు. వారు తమ స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications