గీత నా కూతురే: కలిసేందుకు మహిళ దరఖాస్తు
భోపాల్: పదేళ్ల క్రితం భారత్ నుంచి తప్పిపోయి పాకిస్థాన్ చేరిన మూగ, బధిర యువతి గీత ఇటీవలే భారత్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. కాగా, ఇప్పటికే గీత తల్లిదండ్రులం తామేనంటూ పలు కుటుంబాలు చెప్పినా.. ఎలాంటి రుజువు దొరకలేదు.
తాజాగా గీత తల్లిని తానేనంటూ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్‌పూర్‌కు చెందిన 40ఏళ్ల అనీసా బీ అనే మహిళ తెలిపింది. గీత తన కుమార్తె నజ్జో అని ఆమె చెబుతున్నారు. నజ్జోకు 13ఏళ్ల వయసున్నప్పుడు నర్సింగ్‌పూర్ జిల్లాలోని గోటేగావ్ నుంచి తప్పిపోయిందని ఆమె తెలిపారు.

గీతను కలిసేందుకు తనకు అనుమతినివ్వాలని జిల్లా సామాజిక న్యాయ విభాగానికి అనీసా దరఖాస్తు పెట్టుకున్నారు. తన దగ్గర ఉన్న చిన్నప్పటి ఫొటోను దరఖాస్తుకు జతచేశారు. తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు.
ఆమె దరఖాస్తును జిల్లా సామాజిక న్యాయ విభాగానికి అందజేసినట్లు జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ ఆశీష్ సింగ్ తెలిపారు. దరఖాస్తును కేంద్రానికి పంపించడం జరుగుతుందని, కేంద్రమే ఈ విషయాన్ని తేలుస్తుందని చెప్పారు. గీతను కలిసేందుకు మరో నాలుగు కుటుంబాలు కూడా గతంలో దరఖాస్తు చేసుకున్నాయని తెలిపారు.












Click it and Unblock the Notifications