రాఘవ్ చద్దాకు జెన్ జీ దిమ్మతిరిగే షాక్..! ఏకంగా 10 లక్షల మంది..!
నిన్న మొన్నటి వరకూ ఆయన ఓ హీరో. రాజ్యసభలో సామాన్యుడి గొంతు వినిపిస్తూ ప్రజల ఎంపీగా గుర్తింపు పొందారు. రాజ్యసభలో ఆయన ఓ ప్రశ్న అడిగితే చాలు జెన్ జీ ఆ వీడియోల్ని తెగ వైరల్ చేసేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఆమ్ ఎప్పుడైతే ఆయన పార్టీ మారారో ఆయన్ను అభిమానించిన వారే దూరం కావడం ప్రారంభించారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా పది లక్షల మంది సోషల్ మీడియాలో ఆయన్ను వదిలి వెళ్లిపోయారు. ఆయనే ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరిన రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha).
ఇప్పటివరకూ ప్రజల ఎంపీగా ఆయన్ను అభిమానించిన జెన్ జీ తరం.. ఇప్పుడు రాఘవ్ చద్దా పేరు చెబితేనే మండిపడుతున్నారు. ఇన్నాళ్లూ తాము మోసింది ఇతన్నా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలోని రాఘవ్ చద్దా హ్యాండిల్స్ కు ఫాలోవర్లుగా ఉన్న వీరంతా క్రమంగా తప్పుకుంటున్నారు. గుంపులు గుంపులుగా వాటిని అన్ ఫాలో కొట్టేస్తున్నారు. దీంతో గంటల వ్యవధిలో రాఘవ్ చద్దా ఏకంగా మిలియన్ (10 లక్షల మంది) ఫాలోవర్లను కోల్పోయారు. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

దీన్ని బట్టి చూస్తుంటే ఆమ్ ఆద్మీ పార్టీ ని వీడి బీజేపీలో చేరిన రాఘవ్ చద్దా ప్రజాదరణ తీవ్రంగా దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. చద్దా ఆరుగురు ఆప్ రాజ్యసభ ఎంపీలను కూడా తనతో పాటు బీజేపీలోకి తీసుకువెళ్లారు. దీంతో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ .. తన శ్రేణులను ఐక్యంగా ఉంచుకోవడానికి నానా తంటాలు పడుతోంది. కొన్ని వారాల క్రితం ఆప్ రాజ్యసభ ఉప నాయకుడి పదవి నుంచి ఆయన్ను తొలగించిన తర్వాత..చద్దా బీజేపీలో చేరతారని విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే ఆయన నిర్ణయం జెన్ జెడ్ తరాన్ని మాత్రం అసంతృప్తికి గురి చేసింది.














Click it and Unblock the Notifications