సాధారణ భక్తులు అయోధ్య రామాలయాన్ని దర్శించే తేదీ ఇదే
Ayodhya Ram Mandir: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవ గడువు సమీపించింది. ఈ నెల 22వ తేదీన ఈ ఆలయాన్ని ప్రారంభించాల్సి ఉంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా 4,000 వేలమంది ప్రముఖులు హాజరు కానున్నారు. వివిధ దేశాల నుంచి వందమంది ప్రతినిధులు పాల్గొననున్నారు.
ఇప్పటికే ఆహ్వాన పత్రికలు అందాయి. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్ నటీనటులు, సెలెబ్రిటీలకు ఆహ్వానం అందింది. అయోధ్యలో ప్రతి ఇంటికీ రామాలయ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికలను పంపించింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.

ఈ నెల 15వ తేదీ నాడే ప్రారంభోత్సవ కార్యక్రమాలు, ఆచారాల మొదలయ్యాయి. ఆగమోక్తంగా పూజాదికాలను నిర్వహిస్తోన్నారు అర్చకులు. వేదమంత్రోచ్ఛారణలతో అయోధ్యా నగరం మారుమోగిపోతోంది. ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సాయంత్రం లక్ష్మణ సమేత శ్రీ సీతారామచంద్రస్వామి వారి విగ్రహాలను ఆలయంలోనికి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి.
దేశం నలుమూలల నుంచి వేలాదిమంది ప్రముఖులు ఇక్కడికి రానుండటంతో భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టం అయ్యాయి. ఎక్కడికక్కడ బ్యారికేడ్లను అమర్చుతున్నారు. వీఐపీల కోసం ప్రత్యేకంగా కారిడార్‌ను ఏర్పాటు చేశారు. అయోధ్యలోని శ్రీవాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆలయం వరకు సెక్యూరిటీ కారిడార్ ఉంటుంది.
ఆలయం ఇంకా పూర్తిస్థాయిలో నిర్మితం కాకముందే రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేయబోతోన్నారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కొందరు పీఠాధిపతులు సైతం దీనిపై అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. పూర్తిగా నిర్మితం కాని ఆలయంలో శ్రీరామ ప్రాణప్రతిష్ఠా మహోత్సవం జరగడం హితం కాదని చెబుతున్నారు.
రామమందిరం ప్రారంభం పూర్తయినప్పటికీ- సాధారణ భక్తులకు ఇప్పట్లో దాన్ని దర్శించే వీలు ఉండకపోవచ్చని, నిర్మాణం పూర్తయిన తరువాతే అనుమతి ఇస్తారనే వార్తలు వెలువడుతున్నాయి. దీనిపై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ స్పందించింది. ఈ వార్తలను తోసిపుచ్చింది.
రామమందిరం ఆలయంలో రాములవారి ప్రాణప్రతిష్ఠ, ప్రారంభోత్సవ కార్యక్రమాలు పూర్తయిన మరుసటి రోజు నుంచే అంటే- జనవరి 23వ తేదీ నుంచే సాధారణ భక్తుల ప్రవేశానికి అనుమతి ఇస్తామని తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. ఆలయం నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications