దారుణం: 15ఏళ్ల అమ్మాయిపై 29 మంది మృగాళ్లు అత్యాచారం: వీడియో షేర్ - చివరికి..?

ముంబాయి/బెంగళూరు: స్నేహితుడితో కలిసి వెళ్లిన అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారు. నమ్మకంతో స్నేహితుడి వెంట వెళ్లిన అమ్మాయిని బెదిరించిన ఆమె స్నేహితుడు అత్యాచారం చేశాడు. అత్యాచారం చేసే సమయంలో కామాంధుడు వీడియో తీశాడు. తరువాత అత్యాచారం వీడియో అడ్డం పెట్టుకుని ఆమెను రహస్య ప్రాంతాలకు బలవంతంగా పిలుచుకుని వెళ్లి మళ్లీ లైంగిక దాడికి పాల్పడేవాడు. అత్యాచారం వీడియోను అమ్మాయికి పరిచయం ఉన్న మరో ముగ్గురికి షేర్ చేశాడు. ఆ ముగ్గురు ఆ వీడియో అమ్మాయికి చూపించి మా కోరికలు తీర్చకుంటే ఈ వీడియో సోషల్ మీడియాలో లీక్ చేస్తామని బెదిరించి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. బాయ్ ఫ్రెండ్ తో పాటు నలుగురు ఆమెపై పైశాచికంగా వ్యవహరించారు. ఇలా అత్యాచారం వీడియోను స్నేహితులకు షేర్ చెయ్యడంతో ఇప్పటి వరకు 29 మంది ఆమె మీద పదేపదే అత్యాచారం చేశారు. ఈ వీడియో అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తూ ఎప్పుడుపడితే అప్పుడు పిలుచుకుని వెళ్లి సామూహిక అత్యాచారం చెయ్యడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. మైనర్ అమ్మాయి మీద సామూహిక అత్యాచారం చేసిన కేసులో ఇప్పటికే 23 మందిని అరెస్టు చెయ్యడం కలకలం రేపింది.

 మైనర్ అమ్మాయి బాయ్ ఫ్రెండ్

మైనర్ అమ్మాయి బాయ్ ఫ్రెండ్

మహారాష్ట్రలోని డోంబ్లివి ప్రాంతంలోని మనపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో 15 ఏళ్ల అమ్మాయి నివాసం ఉంటున్నది. అమ్మాయికి ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఇదే ఏడాది జనవరి నెలలో అమ్మాయికి మాయమాటలు చెప్పిన బాయ్ ఫ్రెండ్ ఆమెను నిర్జనప్రదేశంలోకి పిలుచుకుని వెళ్లి బలవంతంగా రొమాన్స్ చెయ్యడం మొదలు పెట్టాడు.

 రేప్ వీడియో అడ్డం పెట్టుకుని ?

రేప్ వీడియో అడ్డం పెట్టుకుని ?

నమ్మకంతో స్నేహితుడి వెంట వెళ్లిన అమ్మాయిని బెదిరించిన ఆమె స్నేహితుడు అత్యాచారం చేశాడు. అత్యాచారం చేసే సమయంలో కామాంధుడు అతని స్మార్ట్ ఫోన్ లో వీడియో తీశాడు. తరువాత ఆ వీడియో అడ్డం పెట్టుకుని ఆమెను జనవరి నుంచి ఇప్పటి వరకు రహస్య ప్రాంతాలకు పిలుచుకుని వెళ్లి పదేపదే అదే దారుణానికి పాల్పడ్డాడు

 అమ్మాయి ఫ్రెండ్స్ కు వీడియో షేర్

అమ్మాయి ఫ్రెండ్స్ కు వీడియో షేర్

అమ్మాయి బాయ్ ఫ్రెండ్స్ కు పరిచయం ఉన్న మరో ముగ్గురు యువకులు కూడా ఆమెకు పరిచయం ఉన్నారు. అమ్మాయి మీద అత్యాచారం చేసిన ఆమె బాయ్ ఫ్రెండ్ తరువాత అంతటితో ఆమెను వదిలిపెట్టలేదు. అమ్మాయికి పరిచయం ఉన్న మరో ముగ్గురికి తాను అత్యాచారంకు పాల్పడ్డ వీడియో షేర్ చేశాడు. ఆ ముగ్గురు ఆ వీడియోను అమ్మాయికి చూపించి మా కోరికలు తీర్చకుంటే ఈ వీడియో సోషల్ మీడియాలో లీక్ చేస్తామని బెదిరించి ఆమె పై సామూహిక అత్యాచారంకు పాల్పడ్డారు

 ప్రతిసారి ఫ్రెండ్స్ ని పిలిపించి గ్యాంగ్ రేప్

ప్రతిసారి ఫ్రెండ్స్ ని పిలిపించి గ్యాంగ్ రేప్

బాయ్ ఫ్రెండ్ తో పాటు నలుగురు ఆమెపై లైంగిక దాడి చేస్తూనే ఉన్నారు. ఈ నలుగురు వారికి పరిచయం ఉన్న స్నేహితులను కూడా పిలిపించుకుని ఆమె మీద అత్యాచారం చెయ్యడం మొదలుపెట్టారు. గత జనవరి నెల నుంచి సెప్టెంబర్ నెల వరకు 29 మంది కామాంధులు ఆమె పై మృగంలా లైంగిక దాడి చేస్తూ వచ్చారు.

 మైనర్ రేప్ కేసులో 23 మంది అరెస్టు

మైనర్ రేప్ కేసులో 23 మంది అరెస్టు

అత్యాచారం వీడియోను స్నేహితులకు షేర్ చెయ్యడంతో ఇప్పటి వరకు 29 మంది ఆమె మీద పదేపదే లైంగిక దాడికి పాల్పడ్డారు. అత్యాచారం వీడియో అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తూ ఎప్పుడుపడితే అప్పుడు పిలుచుకుని వెళ్లి సామూహిక అత్యాచారం చెయ్యడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. మైనర్ బాలిక చెప్పిన వివరాలు తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు.

 బెదిరించి రహస్య ప్రాంతాల్లో

బెదిరించి రహస్య ప్రాంతాల్లో

మైనర్ అమ్మాయిని దోంబివ్లి, ముర్చాద్, థానే, రబాలే, ముంబాయిలోని బద్లాపూర్, నవీ ముంబాయి తదితర ప్రాంతాలకు తనను బలవంతంగా పిలుచుకుని వెళ్లి అత్యాచారం చేశారని బాధితురాలు దోంబివల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటి వరకు 23 మంది యువకులను అరెస్టు చేశారు.

Recommended Video

    సింగరేణి బాదిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలన్న షర్మిళ!!
     నాలుగు గంటల్లో నిందితులు అందర్

    నాలుగు గంటల్లో నిందితులు అందర్

    అమ్మాయి అత్యాచారం కేసులో ఇద్దరు మైనర్లు కూడా ఉండటం కలకలం రేపింది. అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేసిన మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అమ్మాయి కేసు పెట్టిన తరువాత కేవలం నాలుగు గంటల సమయంలో 23 మందిని అరెస్టు చేశామని పోలీసు అధికారులు చెప్పారు. 2021 జనవరి నుంచి 2021 సెప్టెంబర్ మద్య కాలంలో యువతి మీద 29 మంది నిందితులు పదేపదే అత్యాచారం చేశారని వెలుగులోకి వచ్చిన ఘటన మహారాష్ట్రలో కలకలం రేపింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+