దారుణం: ఇంట్లోవున్న యువతిపై దాడి, గ్యాంగ్‌రేప్
ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ధిధౌలి గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ఉన్న ఓ యువతిపై దాడికి పాల్పడిన నలుగురు యువకులు, ఆ తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. నిందితులైన నలుగురు యువకులు మంగళవారం రాత్రి ఆ యువతి ఇంట్లోకి చొరబడ్డారు. ఆ సమయంలో ఆమె తండ్రి పొలం పనుల కోసం బయటికి వెళ్లారు.

ఒంటరిగా ఉన్న ఆ యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రతిఘటించేందుకు ప్రయత్నించగా ఆమెను తీవ్రంగా కొట్టారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని యువతిని బెదిరింపులకు గురిచేశారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications