పెళ్లికి నో: బాయ్‌ఫ్రెండ్ ఇంట్లో అమ్మాయి ఆత్మహత్య

ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న ఐశ్వర్య మణికంఠ ఇంట్లో సీలింగ్‌కు వేలాడుతూ కనిపించింది. రాత్రి తొమ్మిది గంటలకు ఇంటికి వచ్చిన మణికంఠ ఆ దృశ్యాన్ని చూశాడు. అతని తల్లిదండ్రులు కూలీలు. ఆ సంఘటన జరిగినప్పుడు మణికంఠ సరుకుల కోసం దుకాణానికి వెళ్లగా తల్లిదండ్రులు పనికి వెళ్లారు.
చిన్నతనంలోనే ఐశ్వర్య తల్లిదండ్రులను కోల్పోయింది. శివకుమార్ అనే సంరక్షుడి వద్ద ఆమె పెరిగింది. ప్రభుత్వ పియు కాలేజీలో చదువుతున్నప్పుడు ఆమెకు మణికంఠతో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. నిజానికి వారిద్దరికి నిరుడు అక్టోబర్‌లో పెళ్లి కావాల్సింది. కానీ శివకుమార్ అందుకు అంగీకరించలేదు.
దాంతో నిరాశకు గురైన ఐశ్వర్య ఇల్లు వదిలేసి మణికంఠ ఇంట్లోనే ఉండసాగింది. ఇటీవల మణికంఠ తల్లిదండ్రులు అతని కోసం పెళ్లి కూతురును చూడడం ప్రారంభించారు. ఈ విషయంపై ఐశ్వర్యకూ మణికంఠకూ, అతని తల్లిదండ్రులకూ మధ్య తరుచుగా వాగ్వివాదం జరుగుతూ వచ్చింది. దీంతో మనస్తాపానికి గురైన ఐశ్వర్య ఆత్మహత్య చేసుకుంది.












Click it and Unblock the Notifications