నీళ్ల కోసం వెళ్తుండగా ఎత్తుకెళ్లి అమ్మాయిపై అత్యాచారం

జిల్లాలోని జోలి గ్రామానికి చెందిన ఓ పదహారేళ్ల దళిత బాలిక నిన్న నీళ్లు తెచ్చేందుకు దగ్గరలోని ఓ చేతి పంపు వద్దకు వెళ్లింది. ఓ యువకుడు ఆమెను అక్కడి నుండి అపహరించి తీసుకు వెళ్లాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకు వెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
విషయం తెలిసుకున్న బాలిక తల్లిదండ్రులు నిందితుడు పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. బాధిత బాలికను పోలీసులు వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.
కాగా, ఇటీవల కేంద్రం నిర్భయ చట్టం తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. అమ్మాయిలు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, అత్యాచారానికి పాల్పడినా నిర్భయ చట్టం కింద కేసులు నమోదవుతున్నాయి.












Click it and Unblock the Notifications