పెళ్లిలో ఆ వంటలు లేవు: ఖరీదైన కారు డిమాండ్, నిఖా ఆపండి, వధువు దెబ్బకు సినిమానే !

Posted By:
Subscribe to Oneindia Telugu

లక్నో: గంటలో నిఖా జరగాల్సి ఉంది. పెళ్లి కుమార్తె ఊరిలో అంతా హడావిడిగా ఉన్నారు. పెళ్లి కుమారుడి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, ఊరి పెద్దలు అందరూ అక్కడికి చేరుకున్నారు. ఇంతలోనే నిఖా ఆపండి అంటూ ఓ సినిమా డైలాగ్ వినపడింది.

పక్క గదిలో భర్త, మరో గదిలో ప్రియుడితో రోమాన్స్: వాట్సాప్ లో, భర్త చూస్తే చీల్చేసింది !

అంతే పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులు ఏమైయ్యింది అంటూ వరుడి కుటుంబ సభ్యుల దగ్గరకు పరుగు తీశారు. నిఖా సందర్బంగా మేము చెప్పిన వంటలు మీరెందుకు చెయ్యలేదు అంటూ వరుడి కుటుంబ సభ్యులు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. అయితే ఇప్పటికి సర్దుకుపోవాలని వధువు కుటుంబ సభ్యులు ఎంత నచ్చ చెప్పినా వరుడి కుటుంబ సభ్యులు మాత్రం ఒంటి కాలి మీద నిలబడ్డారు.

రామాపురంలో

రామాపురంలో

ఉత్తరప్రదేశ్ లోని రామాపురం జిల్లాలోని బోట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దరియాగర్ ఊరిలోని 22 ఏళ్ల యువతి, సమీపంలోని ఊరికి చెందిన యువకుడి వివాహం నిశ్చయం చేశారు. శుక్రవారం నిఖా జరిపించాలని పెద్దలు నిర్ణయించారు.

పెళ్లి కుమార్తె ఊరిలో హడావిడి

పెళ్లి కుమార్తె ఊరిలో హడావిడి

పెళ్లి కుమార్తె ఊరికి పెళ్లి కుమారుడు, అతని కుటుంబ సభ్యులు, బంధువులు, ఊరి పెద్దలు, స్నేహితులు అందరూ వచ్చారు. పెళ్లి కుమార్తె ఊరిలో అంతా హడావిడిగా ఉన్నారు. గంటలో నిఖా జరగాల్సి ఉంది. అంతలో పెళ్లి కుమారుడి కుటుంబ సభ్యులు వంటలు చేస్తున్న ప్రాంతానికి వెళ్లారు.

గోవు మాంసం లేదు !

గోవు మాంసం లేదు !

వంటలు చేస్తున్న ప్రాంతానికి పెళ్లి కుమారుడి కుటుంబ సభ్యులు, బంధువులు వెళ్లారు. గోవు మాంసం వండుతున్నారా అంటూ అక్కడ వంట చేస్తున్న వారిని ప్రశ్నించారు. గోవు మాంసం మేము వండలేదని, కోడి, మేక మాంసంతో వంటలు, బిరియాని చేశామని చెప్పారు.

నిఖా ఆపండి అంటూ కేకలు !

నిఖా ఆపండి అంటూ కేకలు !

వెంటనే పెళ్లి కుమారుడి కుటుంబ సభ్యులు నిఖా ఆపండి అంటూ కేకలు వేశారు. ఏమి జరిగింది అంటూ పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులు ఆరా తీశారు. గోవు మాంసం ఎందుకు వండలేదని వరుడి కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. గోవు మాంసం నిషేధించారని, అందుకే వండలేదని వధువు కుటుంబ సభ్యులు సమాధానం ఇచ్చారు.

ఖరీదైన కారు ఇస్తారా, లేదంటే ?

ఖరీదైన కారు ఇస్తారా, లేదంటే ?

గోవు మాంసం వండలేదు, మా మాటలు లెక్కచెయ్యలేదు, అందుకు ప్రతిఫలంగా మాకు ఖరీదైన కారు బహుమతిగా ఇవ్వాలని వరుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. వధవు కుటుంబ సభ్యులు, ఊరి పెద్దలు ఎంత చెప్పినా వరుడి కుటుంబ సభ్యులు ఒంటికాలి మీద నిలబడ్డారు.

ఏదో ఒకటి కావాలి !

ఏదో ఒకటి కావాలి !

గోవు మాంసం నిషేధిస్తే మేము ఎలా మీకు వంటలు చేసి పెట్టాలి ? అందుకు ఖరీదై కారు కావాలంటున్నారు, ఇప్పుడే ఇలా చేస్తే ఎలా అంటూ వధువు కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. కారు ఇవ్వకపోతే నేను ఈ పెళ్లి చేసుకోనని వరుడు తేల్చి చెప్పాడు.

వధువు దెబ్బతో దూల తీరింది !

వధువు దెబ్బతో దూల తీరింది !

వెంటనే వధువు, ఆమె కుటుంబ సభ్యులు బోట్ పోలీస్ స్టేషన్ లో వరుడు, అతని కుటుంబ సభ్యుల మీద ఫిర్యాదు చేశారు. గోవు మాంసం వండలేదని పెళ్లి నిలిపివేశారని వధువు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని బోట్ పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ రాజేష్ కుమార్ మీడియాకు చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Parents of a bride here cancelled her marriage after rejecting the groom's family's demand that they be served beef at the nikah ceremony in Uttar Pradesh.
Please Wait while comments are loading...