ప్రపంచంలో బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ

సినిమా ప్రపంచం అనేది ఒక రంగుల కలల వేదిక మాత్రమే కాదు, అంచనాలు తప్పితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే జూదశాల అని చెప్పొచ్చు. వేల కోట్ల బడ్జెట్, హాలీవుడ్ హంగులు, అగ్రశ్రేణి నటీనటులు ఉన్నా సరే.. బాక్సాఫీస్ వద్ద కొన్ని చిత్రాలు కనీసం పోస్టర్ ఖర్చులు కూడా రాబట్టలేవు. అలాంటి ఒక ఊహించని డిజాస్టర్ మూవీ 'డిజర్ట్ వారియర్'. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సినిమా లెక్కలు చూస్తుంటే ట్రేడ్ వర్గాలు సైతం విస్మయానికి గురవుతున్నాయి.

మొదలైన భారీ కల.. ముగిసిన పీడకల

'రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్' లాంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన రూపర్స్‌ వ్యాట్ దర్శకత్వంలో, సౌదీ మీడియా దిగ్గజం 'ఎంబీసీ గ్రూప్' ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఆంథోనీ మాకీ, బెన్ కింగ్‌స్లే వంటి దిగ్గజ నటీనటులతో ఏడో శతాబ్దపు అరేబియా నేపథ్యంలో సాగే ఒక అద్భుతమైన పీరియడ్ డ్రామాను ఆవిష్కరించాలని ప్రయత్నించారు. ఇందుకోసం ఏకంగా రూ. 1400 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించి మంచినీళ్లలా ఖర్చు చేశారు.

Desert Warrior Became One of Cinema Biggest Flops Despite a 1400 Crore Budget and earned just 6crore

అంతులేని నష్టాలు

ఏ సినిమాకైనా సరైన ప్రమోషన్ లేకపోతే ఫలితం ఎంత దారుణంగా ఉంటుందో 'డిజర్ట్ వారియర్' నిరూపించింది. షూటింగ్ దశలో ఎదురైన జాప్యం వల్ల బడ్జెట్ అదుపు తప్పి వందల కోట్లకు చేరడమే కాకుండా, సినిమా రిలీజ్ సమయానికి కనీస ప్రచారం కూడా చేయకపోవడం ఈ చిత్ర పతనానికి దారితీసింది. మరీ ముఖ్యంగా, ప్రధాన హీరో ఆంథోనీ మాకీ ప్రమోషన్స్ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించడం కూడా ఈ సినిమా పోవడానికి మరో కారణం.

ఈ సినిమా ఫ్లాప్ అనేది చరిత్రలో మాయని మచ్చలా నిలిచిపోయింది. పెట్టిన పెట్టుబడి రూ. 1,400 కోట్లు అయితే రాబట్టిన వసూళ్లు కేవలం రూ. 6 కోట్లు..! అంతే. నష్ట శాతం 99 శాతం కంటే ఎక్కువ. పెట్టిన పెట్టుబడిలో ఒక శాతం కూడా వెనక్కి తీసుకురాలేకపోయిన ఈ చిత్రం, ప్రపంచ సినిమా చరిత్రలోనే అత్యంత దారుణమైన నష్టాలను మూటగట్టుకున్న సినిమాగా రికార్డు సృష్టించింది.

పాఠం నేర్పిన పరాజయం

కంటెంట్ ఎంత బాగున్నా, టెక్నాలజీ ఎంత అద్భుతంగా ఉన్నా.. ప్రేక్షకుడికి సినిమాను సరిగ్గా చేరవేయలేకపోతే ఫలితం శూన్యమని ఈ డిజాస్టర్ నిరూపించింది. కనీసం ప్రమోషన్స్ లేని సినిమాను ఆడియన్స్ ఎంత నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తారో చెప్పడానికి 'డిజర్ట్ వారియర్' ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. సినిమా రంగంలో ఉన్నవారికి ఇదొక హెచ్చరిక లాంటి పాఠం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+