సోదరిని కాల్చి చంపిన అన్నయ్య: పరువు హత్య?
మీరట్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ సోదరుడు తన సోదరిని కాల్చి చంపాడు. ఈ సంఘటన మీరట్ జిల్లాలోని జానీ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ విషయాన్ని పోలీసులు మంగళవారం వెల్లడించారు. దీన్ని పరువు హత్యగా అనుమానిస్తున్నారు. అన్నయ్య తన సోదరిని తమ ఇంట్లోనే కాల్చి చంపాడు.
నిందితుడు అష్రాఫ్‌కు, 20 ఏళ్ల అతని సోదరి రీనాకు మధ్య సోమవారం గొడవ జరిగింది. ఈ గొడవ నేపథ్యంలో అష్రాఫ్ రీనాను కాల్చి చంపాడు. ఈ హత్యకు సంబంధించి సివల్కాస్ నివాసి, తండ్రి నుస్రత్ అలీ తన కుమారుడు అష్రాఫ్‌పై ఫిర్యాదు చేశాడు.

నెలన్నర క్రితం నుస్రత్ కూతురు రీనా ఆసిఫ్ కుమారుడు యూనుస్‌తో ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆసిఫ్‌పై, అతని తల్లి ఆమన్, మరో ఐదుగురిపై ఆష్రాఫ్ కిడ్నాప్ కేసు పెట్టాడు. ఆశ్చర్యకరంగా నవంబర్ 11వ తేదీన ఇంటికి తిరిగి వచ్చింది. దాంతో ఆమెను కోర్టులో ప్రవేశపెట్టారు.
తన ఇష్టప్రకారమే యూనుస్‌తో ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు రీనా కోర్టులో చెప్పింది. దాంతో అష్రాఫ్, రీనాకు మధ్య పలు మార్లు ఆ విషయంపై గొడవ జరిగింది. పోస్టు మార్టం నిర్వహించిన తర్వాత మృతురాలి శరీరాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications