పెళ్లికి నిరాకరణ: ప్రియుడిపై ప్రేయసి యాసిడ్ దాడి

Acid
బస్తీ/ ముంబై: ప్రియుడిపై ఓ 20 ఏళ్ల అమ్మాయి యాసిడ్ దాడికి పాల్పడింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బస్తీ జిల్లా పధ్నీ గ్రామంలో సోమవారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. పెళ్లికి నిరాకరించినందుకు ఆగ్రహించిన యువతి ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు మంగళవారం చెప్పారు.

ధర్మేంద్ర అనే యువకుడిపై అతని ప్రియురాలు యాసిడ్ దాడి చేసింది. ప్రేమించి, పెళ్లి చేసుకోవడానికి ఇష్టపోడకపోవడంతో ఆమె అతనిపై కోపం పెంచుకున్నట్లు చెబుతున్నారు. తీవ్రంగా గాయపడిన యువకుడిని జిల్లా ఆస్పత్రికి తరలించారు.

ఇదిలావుంటే, తనకు తెలిసినవారి నుంచి 20 ఏళ్ల ధనశ్రీ చిప్కర్ అనే అమ్మాయి 4.5 లక్షల రూపాయల విలువ చేసే బంగారాన్ని దోచుకుంది. ఖరీదైన ఫోన్ కొనక్కోవడానికి బంగారాన్ని దొంగిలించినట్లు ఆ అమ్మాయి పోలీసులకు చెప్పింది.

చిప్కర్‌ను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఆమె నుంచి 3.44 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. త్రివేది కప్ బోర్డు తెరిచి ఉండడంతో ఆమె బంగారు ఆభరణాలను దొంగిలించడం సులభమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+