ప్రేమ కోసమై.. దొంగగా మారిన ప్రియురాలు!
ప్రేమ ఎంతటి పనైనా చేయిస్తుంది. ఎలాంటి వారినైనా మార్చేస్తుంది. ప్రేమకు ఉన్న శక్తి అటువంటిది. అయితే ఇటీవల కాలంలో ప్రేమ కోసం, ప్రేమించిన ప్రియుడు కోసం దారుణాలు చేస్తున్న మహిళల సంఖ్య పెరిగిపోతుంది. కట్టుకున్న భర్తను, కడుపున పుట్టిన బిడ్డలను కూడా కడతేరుస్తున్న అనేక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఛత్తీస్ గడ్ లోని కంకేర్ జిల్లాలో ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది.
ప్రియుడి కోసం ప్రియురాలు చోరీ
తన ప్రియుడికి బైక్ కొనాలన్న ఉద్దేశంతో ఓ ప్రియురాలు పట్టపగలు దొంగతనం చేసి పట్టుబడింది. ప్రియుడితో కలిసి తన బంధువుల ఇంట్లోనే నగదు, నగలు సహా, సుమారు 2లక్షల రూపాయల విలువైన వస్తువులను చోరీచేసి అడ్డంగా దొరికిపోయింది. ఆగస్టు 8వ తేదీన మధ్యాహ్నం హల్బా పోలీస్ స్టేషన్ పరిధిలోని కన్నయ్య పటేల్ అనే వ్యక్తి కూరగాయల అమ్మడానికి మార్కెట్ కి వెళ్లి, ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో చోరీ జరిగింది.

దొంగతనంపై పోలీసుల దర్యాప్తు
దీంతో అతను పోలీస్ స్టేషన్లో తన ఇంట్లో దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేశారు. ఇంట్లో రెండుపెట్టెల నుంచి 95వేల రూపాయల నగదు, బంగారం, వెండి ఆభరణాలు కనిపించకుండా పోయాయి అన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తులో వారు దొంగతనం జరిగిన రోజు కన్నయ్య ఇంటిదగ్గర 22సంవత్సరాల కరుణ పటేల్, 24సంవత్సరాల ఆమె ప్రియుడు తమర్ధవాజ్ విశ్వకర్మ అనుమానాస్పదంగా తిరిగినట్టు గుర్తించారు.
ప్రియురాలు చెప్పింది విని షాక్
దీంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు ఆ ప్రియురాలు చెప్పింది విని షాక్ తిన్నారు. ప్రియుడికి బైక్ కొనివ్వడం కోసం డబ్బులు అవసరమని దొంగతనానికి ప్లాన్ చేసినట్టు ప్రియురాలు కరుణ ఒప్పుకుంది. ఈ క్రమంలోనే ఆగస్టు ఎనిమిదో తేదీ మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో కరుణ బంధువుల ఇంటి తాళం పగలకొట్టి దొంగతనానికి పాల్పడింది.
ప్రియుడు కోసం దొంగతనం చేసినట్టు అంగీకరించిన ప్రియురాలు
కరుణ దొంగతనం చేస్తుంటే ఆమె ప్రియుడు ఎవరు వస్తున్నారు అనేది గమనిస్తూ రెక్కి నిర్వహించాడు. ఇక దొంగిలించిన నగదును కరుణ ప్రేమికుడికి ఇచ్చి నగలను తన వద్ద ఉంచుకుంది. పోలీసులకు పట్టుబడిన తర్వాత నేరం అంగీకరించిన వీరిద్దరి నుండి దొంగిలించిన వస్తువులను రికవరీ చేసిన పోలీసులు వీరిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు.
ప్రియుడు కోసం దొంగతనం చేసిన ప్రియురాలిపై చర్చ
ఇక ఈ వార్త విన్న వాళ్లంతా ప్రియుడు కోసం దొంగతనానికి ఒడిగట్టిందా? ఇదేం దారుణం అంటూ నోరెళ్ళబెడుతున్నారు. ప్రేమ కోసం ఏవేవో చేసారంటే విన్నాను కానీ దొంగతనం చేయడం ఇప్పుడే వింటున్నాం అంటూ పలువురు ఈ వార్త విని అవాక్కవుతున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications