Goa exit poll Results 2022: ఢిల్లీలో లీడర్స్ ను గట్టిగా పట్టుకున్న కాంగ్రెస్, ఆ రోజుల్లో !
గోవా/న్యూఢిల్లీ: 2017లో గోవా శాసన సభ ఎన్నికల్లో మెజారిటీ ఎమ్మెల్యేలను గెలిపించుకున్న కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆకర్షించడంలో విఫలం అయిన తరువాత బీజేపీ ఆడిన మైండ్ గేమ్ లో షాక్ కు గురై కొన్ని సంవత్సరాలు పాటు కోలుకోలేకపోయింది. ఐదు సంవత్సరాలు గోవాలో అధికారానికి దూరం అయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎన్నికల ఫలితాలకు ముందే ఆ పార్టీ నాయకుల అలర్ట్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ తో ఇప్పటికే చర్చలు మొదలు పెట్టిన గోవా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో చర్చలు మొదలు పెట్టారు.
గోవాలో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ తో పోటీ చేసిన నాయకులు అందరూ దాదాపుగా ఢిల్లీలోనే మకాం వేశారు. గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జారిపోకుండా కేసీ వేణుగోపాల్ ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిసింది. మా పార్టీకి మెజారీ ఎమ్మెల్యేలు లేకపోతే ఇతర పార్టీలతో కలిసి గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, ఈసారి బీజేపీకి మాత్రం ఆ చాన్స్ ఇవ్వమని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. అవసరం అయితే ఇతర పార్టీల నాయకులకు మంత్రి పదవులు ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్దం అవుతోందని తెలిసింది.

ఒక్క దెబ్బతో షాక్ కు గురై గిలగిల కొట్టుకున్న కాంగ్రెస్
2017లో గోవా శాసన సభ ఎన్నికల్లో 17 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆకర్షించడంలో విఫలం అయిన తరువాత బీజేపీ ఆడిన మైండ్ గేమ్ లో షాక్ కు గురై కొన్ని సంవత్సరాలు పాటు కోలుకోలేకపోయింది. ఐదు సంవత్సరాలు గోవాలో అధికారానికి దూరం అయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎన్నికల ఫలితాలకు ముందే ఆ పార్టీ నాయకుల అలర్ట్ అయ్యారు.

గోవా కాంగ్రెస్ లీడర్స్ ఛలో ఢిల్లీ
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ తో ఇప్పటికే చర్చలు మొదలు పెట్టిన గోవా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో చర్చలు మొదలు పెట్టారు. గోవాలో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ తో పోటీ చేసిన నాయకులు అందరూ దాదాపుగా ఢిల్లీలోనే మకాం వేశారు.

కేసీ వేణుగోపాల్ ఎంట్రీ
గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జారిపోకుండా కేసీ వేణుగోపాల్ ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిసింది. మా పార్టీకి మెజారీ ఎమ్మెల్యేలు లేకపోతే ఇతర పార్టీలతో కలిసి గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, ఈసారి బీజేపీకి మాత్రం ఆ చాన్స్ ఇవ్వమని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. అవసరం అయితే ఇతర పార్టీల నాయకులకు మంత్రి పదవులు ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్దం అవుతోందని తెలిసింది.

జంప్ కాకుండా జాగ్రత్తలు
గోవా అసెంబ్లీ ఫలితాలు వెలువడిన తరువాత కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ తో గెలిచిన ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ అయినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని కొందరు రాజకీయ నాయకులు అంటున్నారు. మొత్తం మీద గోవాలో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ మీద పోటీ చేసిన నాయకులు అందర్ని ఢిల్లీ పిలిపించుకున్న కాంగ్రెస్ లీడర్స్ వారు జారిపోకుండా ఇప్పటి నుంచి కాపలా ఉంటున్నారని వెలుగు చూసింది.












Click it and Unblock the Notifications