వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'స్లీవ్‌లెస్ దుస్తులు, టీ షర్ట్స్, జీన్ ప్యాంట్స్ ధరించొద్దు'

By Srinivas
|
Google Oneindia TeluguNews

పనాజీ: ఉద్యోగులు ఎవరు కూడా స్లీవ్ లెస్ దుస్తులు, జీన్స్, టీ షర్ట్స్, మల్టీ ప్యాకెట్ ప్యాంట్స్ ధరించవద్దని గోవా ప్రభుత్వం ఆర్ట్ అండ్ కల్చరల్ డిపార్ట్‌మెంట్ తన ఉద్యోగులను ఆదేశాలు జారీ చేసింది. ఆపీసు సమయంలో అలాంటి దుస్తులు వేసుకు రావొద్దని సూచించింది.

రాష్ట్ర అసెంబ్లీలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఆర్ట్ అండ్ కల్చర్ మంత్రి దయానంద్ మాంద్రేకర్ ఈ విషయాన్ని చెప్పారు. తన శాఖలో పని చేసే ఉద్యోగులకు దుస్తుల విషయంలో ఆదేశాలు జారీ చేసినట్లు సభలో చెప్పారు.

 Goa government department bans sleeveless dresses, jeans for 'decorum'

కేవలం ఫార్మల్ దుస్తులు మాత్రమే ధరించాలని చెప్పామన్నారు. డైరెక్టర్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ లోలియంకర్ ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేశారని చెప్పారు.

'ఉద్యోగులు తప్పనిసరిగా ఫార్మల్ డ్రెస్సులు ధరించాలి. జీన్స్, టీ షర్ట్స్, స్లీవ్ లెస్, ట్రజర్స్, చాలా జేబులు ఉండే ప్యాంట్లు వంటి దుస్తులు కార్యాలయం సమయంలో ధరించవద్దు. అలాగే అధికారిక కార్యాలయాలలోను వాటిని ధరించవద్దు' అని ఆర్ట్ అండ్ కల్చర్ డైరెక్టర్ ప్రసాద్ లోలియంకర్ తన ఇంటర్ ఆఫీస్ మెమోలో చెప్పారు.

English summary
In a bid to "maintain decorum", Goa government's art and culture department has asked its employees not to wear sleeveless clothes, jeans, T-shirts and multi-pocketed pants during the office hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X