మరణాలకు సారీ, కవచంగా వాడుకోలేదు: రాంపాల్

చండీఘడ్: 2006 హత్య కేసులో వివాదాస్పద స్వామి రాంపాల్ బెయిల్‌ను హర్యానా, పంజాబ్ హైకోర్టు రద్దు చేసి, వెంటనే కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించింది. హిస్సార్‌లో ఆశ్రమంలో రాంపాల్‌ను పోలీసులు బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. తన అనుచరుల మృతికి ఆయన విచారం వ్యక్తం చేశారు.

మరణాలకు విచారం వ్యక్తం చేస్తున్నానని, తాను మావన కవచాన్ని వాడుకోలేదని ఆయన స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అబద్ధాలేనని ఆయన ఆస్పత్రి అన్నారు. కోర్టు ధిక్కరణకు పాల్పడిన రాంపాల్‌ను తమ ముందు హాజరు పరచాలని కోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దాంతో పోలీసులు రంగంలోకి దిగారు.

‘Godman’ Rampal sorry about followers' deaths, says didn’t use anyone as human shield

బుధవారం రాత్రి ఆయనను అరెస్టు చేయడంతో రెండు వారాల ఉత్కంఠకు తెరపడింది. హైకోర్టు పరిసరాల్లో భారీగా భద్రతా సిబ్బందిని మోహరించారు. రాంపాల్ మూడు సార్లు కోర్టుకు హాజరు కాకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు. నవంబర్ 5, 10, 17 తేదీల్లో ఆయన కోర్టుకు హాజరు కావాల్సి ఉండింది.

చాలా కఠినమైన ఆపరేషన్ తర్వాత రాంపాల్‌ను అరెస్టు చేయగలిగామని డిజిపి ఎస్ఎన్ వశిష్ట్ అన్నారు. వేలాది మంది వృద్ధులు, మహిళలు, చిన్నారులు ఆశ్రమంలో ఉన్నందున జాగ్రత్తగా వ్యవహరించాల్సి వచ్చిందని అన్నారు. రాంపాల్‌ను పట్టుకునే క్రమంలో జరిగిన ఘర్షణల్లో 200 మందికి పైగా గాయపడ్డారు. వారిలో 70 మంది జర్నలిస్టులు, 105 మంది పోలీసులు ఉన్నారు.

పోలీసులు 15 వేల మందిని వదిలేశారు. హింసకు పాల్పడ్డారనే ఆరోపణపై 492 మందిని అదుపులోకి తీసుకున్నారు. రాంపాల్ పట్టుకునే క్రమంలో జరిగిన పరిణామాల్లో నలుగురు మరణించారు. నలుగురు మహిళలు ఆశ్రమంలో చనిపోగా, వారిని పోలీసులకు అప్పగించారు. మరో మహిళ, శిశువు ఆస్పత్రిలో చికిత్స పొందతూ మరణించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+