2వేల నోట్లతో బంగారం కొనుగోళ్ళ డీల్: ముందు ముందు బంగారం షాపులకు పండుగే!!

విపరీతంగా పెరిగిన బంగారం ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనుగోలుకు విముఖత చూపిస్తున్నారు. ఇటీవల కాలంలో చూస్తే బంగారం కొనుగోలు పెరిగిన ధరల నేపథ్యంలో గణనీయంగా తగ్గాయి. అయితే తాజాగా ఆర్బీఐ తీసుకున్న 2000 నోట్ల ఉపసంహరణ నిర్ణయం మళ్లీ బంగారం కొనుగోళ్లను పెంచుతుందని నిపుణులు భావిస్తున్నారు.

ఆర్బీఐ 2000 నోట్ల ఉపసంహరణకు సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. అప్పటివరకు రెండువేల నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసుకోవచ్చని ఆర్బిఐ పేర్కొంది. అయితే ప్రతి రోజూ 20 వేల రూపాయలు మాత్రమే ఒక వ్యక్తి తన ఖాతాలో డిపాజిట్ చేసుకోవడానికి ఆర్బిఐ వీలు కల్పించింది. దీంతో 2000 రూపాయల నోట్లను భారీగా దాచిన చాలామంది 2000 రూపాయల నోట్లను ఎలా వదిలించుకోవాలి అనేది ఆలోచనలో పడ్డారు.

goldcash

అందుకు బంగారం కొనుగోలు చేయడాన్ని ఒక మార్గంగా ఎంచుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే రెండువేల రూపాయల నోట్లతో బంగారాన్ని కొనుగోలు చేస్తామని, బంగారు షాప్ యజమానులతో బేరసారాలు చేస్తున్నారు. ఇక ఇదే అదునుగా బంగారం షాపు యజమానులు బ్లాక్ లో డబ్బులు దాచిన బడాబాబుల నుండి అదనంగా పిండే ప్రయత్నాలు మొదలుపెట్టారు. షాప్ల యజమానులు సహకరిస్తే దీంతో ఆర్బీఐ ఇచ్చిన గడువు ముగిసేలోగా బంగారం కొనుగోళ్ళు బాగా పెరుగుతాయని ఒక అంచనా.

నిన్నా మొన్నటి వరకు విపరీతంగా పెరిగిన బంగారం ధరలతో బంగారం కొనుగోళ్ళు అంటేనే దూరం పారిపోయిన వాళ్ళు ఇప్పుడు ఆర్బీఐ తీసుకున్న సంచలన నిర్ణయం దెబ్బకు బంగారం కొనుగోళ్ళపై ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటికే పలువురు బంగారం కొనుగోళ్ళకు 2 వేల రూపాయల నోట్లు ఇస్తే 5 శాతం నుండి 10 శాతం వరకు అదనంగా తీసుకుంటున్నట్టు సమాచారం.

దీంతో ప్రస్తుతం బంగారం ధరలు 62వేల రూపాయల వరకు ఉంటే, తాజా 2 వేల నోట్ల మార్పిడి దెబ్బకు ఆ కస్టమర్లకు బంగారం ధర బంగారం షాపుల యజమానులు వసూలు చేస్తున్న అదనపు చార్జీలతో కలిపి 66వేల రూపాయల వరకు పడుతుందని తెలుస్తుంది.

సాధారణంగా బంగారం కొనుగోలు చేసేవారు 2 లక్షల లోపు బంగారం, వెండి ఆభరణాలను, వస్తువులను కొనుగోలు చేస్తే అందుకు పాన్, ఆధార్ సమర్పించాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో బంగారం షాపులలో లెక్క దొరక్కుండా 2 వేల రూపాయల నోట్ల మార్పిడికి చాలా మంది బడా బాబులు సిద్ధం అవుతున్నట్టు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+