శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఛాన్స్ వదులుకోకండి
బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునేవారు ధరల దూకుడు చూసి బంగారం షాపుల వంక చూడాలంటేనే భయపడుతున్నారు. బంగారం ధర ప్రస్తుతం లక్ష రూపాయలకు పైగా ఉండడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు బంగారం కొనాలనే ఆలోచననే విరమించుకుంటున్నారు. అయితే తాజాగా బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి ఒక శుభవార్త చెప్పింది బులియన్ మార్కెట్.
తగ్గిన బంగారం, వెండి ధరలు
నేడు భారతదేశంలో వెండి, బంగారం ధరలు బాగా తగ్గాయని, ఈరోజు తెల్లవారుజామున ఎనిమిది గంటల వరకు ఉన్న బంగారం ధరలను చెప్పి బంగారం వెండి కొనుగోలు చేయాలనుకునే వారు ఇష్టమైతే ఇప్పుడు కొనుగోలు చేసుకోవచ్చని వెల్లడించింది. నేడు ఉదయం ఎనిమిది గంటల వరకు తగ్గిన బంగారం ధరల వివరాలను ఒకసారి చూద్దాం.

దేశంలో బంగారం, వెండి ధరలిలా
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1380 రూపాయలు తగ్గి ఒక లక్షా 960 రూపాయలకు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 92,540 రూపాయలకు చేరింది. ఇక వెండి ధర కూడా కిలో 2000 రూపాయలు తగ్గి 1,17,100 రూపాయలకు చేరుకుంది. ఇది ఇలా ఉంటే దేశంలోని ప్రధాన నగరాలలో బంగారం వెండి ధరల వివరాలలోకి వెళితే..
హైదరాబాద్, ఢిల్లీలలో ధరలిలా
హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఒక లక్ష 960 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 92,540 రూపాయలుగా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 01,01, 111 రూపాయలు గాను, 22 క్యారెట్ల బంగారం ధర 92,690 రూపాయలు గాను ఉంది.
ఏపీ, ముంబై లలో బంగారం ధరలు
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఒక లక్ష 960 రూపాయలు గా 24 క్యారెట్ల బంగారం ధర ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర 92,490 రూపాయలుగా ఉంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఒక లక్షా 960 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 92 వేల 490 రూపాయలుగా ఉంది.
బంగారం ధరల తగ్గుదలతో కాస్త రిలీఫ్
బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఒక లక్షా 960 రూపాయలు ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర 92, 540 రూపాయలుగా ఉంది. గత వారం రోజులుగా వరుసగా పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్న బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో సామాన్య మధ్య తరగతి ప్రజలు కాస్త రిలీఫ్ గా ఫీల్ అవుతున్నారు.
బంగారం ధరలు తగ్గుతాయని మళ్ళీ కొత్త ఆశలు
అంతర్జాతీయ మార్కెట్లో పెట్టుబడిదారులు ప్రాఫిట్ బుకింగ్ కోసం అమ్మకాలు చేపట్టడంతో పసిడి ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. ఇన్ని రోజులు బంగారం ధరలు చూసి వెనకడుగు వేసిన వారికి ఇప్పుడు తగ్గుతున్న బంగారం ధరలతో మళ్లీ కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. రేపటి నుంచి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో బంగారం కొనుగోళ్లు భారీగా జరిపే అవకాశం ఉన్న నేపథ్యంలో, ఇప్పుడు బంగారం ధరలు తగ్గడం నిజంగా ఊరట అనే చెప్పాలి.












Click it and Unblock the Notifications