YouTube: యూట్యూబ్ యూజర్లకు గూగుల్ మరో షాక్ ! డీప్ ఫేక్ దెబ్బతో ఇలా..

యూట్యూబ్ యూజర్లకు గూగుల్ మరో షాక్ ఇచ్చింది. కంటెంట్ వీడియోల అప్ లోడింగ్ విషయంలో నిబంధనల్ని మరింత కఠినతరం చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. భారత్ లో డీప్ ఫేక్ వీడియోల రచ్చ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం హెచ్చరికలతో గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది. గూగుల్ నిర్ణయంతో ఇకపై యూట్యూబ్ యూజర్లు ఏదైనా వీడియోను ఆల్టర్ చేస్తే అంటే ఒరిజినల్ వీడియోలో మార్పులు చేస్తే వాటిని బయటపెట్టాల్సి ఉంటుంది.

భారత్ లో తాజాగా పలువురు సెలబ్రిటీలు డీప్ ఫేక్ వీడియోల బారిన పడ్డారు. ఇంకా పడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ యాజమాన్యాలతో తాజాగా చర్చలు జరిపింది. డీప్ ఫేక్ వీడియోల విషయంలో కఠినంగా వ్యవహరించేలా నిబంధనలు మార్చాలని కోరింది. దీంతో గూగుల్ కూడా తమ వీడియో ప్లాట్ ఫామ్ యూట్యూబ్ యూజర్లకు కఠిన నిబంధనలు విధిస్తోంది. ముఖ్యంగా యూట్యూబ్ లో అప్ లోడ్ చేసే వీడియోల విషయంలో వీటిని అమలు చేస్తోంది.

google new rule to youtube users, needs to disclose altered or AI content

ఇకపై యూట్యూబ్ లో అప్ లోడ్ చేసే వీడియోలు మార్ఫింగ్ చేసి లేదా ఏఐ ద్వారా క్రియేట్ చేసినవి ఉంటే ఆ వివరాలు బయటపెట్టాల్సి ఉంటుందని గూగుల్ తెలిపింది. అలా వివరాలు వెల్లడించని వీడియోను తమ ప్లాట్ ఫామ్ నుంచి తొలగిస్తామని ఇవాళ ఓ బ్లాగ్ పోస్ట్ లో హెచ్చరించింది. రాబోయే రోజుల్లో ఏఐ సాధనాలను ఉపయోగించడంతో సహా వాస్తవికమైన మార్చబడిన లేదా సింథటిక్ చేసిన కంటెంట్‌ను బహిర్గతం చేయాలని గూగుల్ కంటెంట్ క్రియేటర్లను కోరుతోంది.

ఇలా యూట్యూబ్ క్రియేటర్లు ఇచ్చిన సమాచారాన్ని తాము వాటిని వీక్షించే వారికి వీడియో ప్లేయర్ లో లేబుల్ ద్వారా వెల్లడిస్తామని గూగుల్ చెబుతోంది. తద్వారా సదరు వీడియోను వీక్షించే యూజర్లకు అవి రియలా లేక ఫేకా అన్నది తెలుస్తుంది.
తాజాగా కేంద్ర కేబినెట్ ఎలక్ట్రానిక్స్, ఐటి మంత్రి అశ్విని వైష్ణవ్, ఎలక్ట్రానిక్స్, ఐటి శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను డీప్‌ఫేక్‌లకు వ్యతిరేకంగా కఠినంగా వ్యవహరించాలని ఆదేశించిన వారంలోపు గూగుల్ ఈ చర్యలు చేపట్టింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+