Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Google Search : మరింత మెరుగ్గా గూగుల్ సెర్చ్-వాటిని తీసేస్తున్న టెక్ దిగ్గజం

ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ సెర్చ్ తమ యూజర్లకు మరింత సులువుగా తాము కోరుకున్న కంటెంట్ ను అందించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా తాజా అప్ డేట్ ను తెస్తోంది. ఇందులో పలు కీలక మార్పులు చేస్తోంది. దీంతో గూగుల్ సెర్చ్ లో ఇకపై యూజర్లు తాము కోరుకున్న వివరాలు వేగంగా సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు.

గూగుల్ సెర్చ్ ను మారుతున్న యూజర్ల అభిరుచులకు అనుగుణంగా మార్చాలని భావిస్తున్న గూగుల్.. అందులో భాగంగా నాసిరకం, ఒరిజినల్ కాని కంటెంట్ ను తొలగించాలని నిర్ణయించింది. తాజా అప్ డేట్ లో ఈ మేరకు మార్పులు చేస్తోంది. ఆగస్టు 22 నుంచి హెల్ప్ ఫుల్ కంటెంట్ అప్ డేట్ పేరుతో కొత్త మార్పును అమల్లోకి తెస్తున్న గూగుల్.. తొలుత ఇంగ్లీష్ వెర్షన్ లో దీన్ని అందించబోతోంది. ఆ తర్వాత మిగిలిన భాషలకూ విస్తరిస్తుంది.

Google rolls out new update to removes low quality and unoriginal content in search

పాఠకులకు సమాచారం ఇవ్వడానికి బదులు కేవలం క్లిక్‌ల కోసమే కంటెంట్ పెట్టినట్లు అనిపిస్తే యూజర్లకు అది ఉపయోపగడపదని గూగుల్ చెబుతోంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఆంగ్ల వినియోగదారుల కోసం వచ్చే వారం నుండి, సెర్చ్ ను సులభతరం చేయడానికి అనేక అప్ డేట్లు తెస్తున్నట్లు చెబుతోంది. ఇది కచ్చితంగా యూజర్ల సెర్చ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుందని గూగుల్ ధీమాగా ఉంది.

ఆన్‌లైన్-విద్యా సామగ్రి, వినోదం, షాపింగ్, టెక్-సంబంధిత కంటెంట్ లో నాసిరకం, ఒరిజినల్ కాని కంటెంట్ ను ఎక్కువగా తొలగించబోతున్నట్లు గూగుల్ సంకేతాలు ఇస్తోంది. గత ఏడాదిగా ఇందుకోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్తున్న గూగుల్.. అందులో భాగంగా తాజా అప్ డేట్లు తెస్తున్నట్లు వివరిస్తోంది. తద్వారా యూజర్లకు మెరుగైన సమాచారం అందుబాటులో ఉంటుందని, సెర్చ్ చేసినప్పుడు నాణ్యత కలిగిన, ఒరిజినల్ కంటెంట్ ఓపెన్ అవుతుందని చెబుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+