మోడీతో గూగుల్ సీఈఓ:క్రికెట్ ఆడిన పిచాయ్ (ఫోటోలు)
న్యూఢిల్లీ: భారత పర్యనటలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీతో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సమావేశమయ్యారు. ఢిల్లీలోని ఎస్ఆర్‌సీసీ కళాశాల విద్యార్ధులతో ముఖాముఖి కార్యక్రంలో పాల్గొన్న అనంతరం ఆయన ప్రధాని నివాసానికి వెళ్లారు.
ఈ సమావేశం సందర్భంగా ప్రధాని, పిచాయ్ మధ్య పలు అంశాలు చర్చకు వచ్చాయి. ప్రధాని మోడీ 'మేకిన్ ఇండియా' గురించి పిచాయ్‌కు వివరించగా, గూగుల్ సంస్థ భారత్‌లో చేపట్టబోయే ప్రాజెక్టుల గురించి పిచాయ్, ప్రధాని మోడీకి వివరించారు.

మోడీతో గూగుల్ సీఈఓ: క్రికెట్ ఆడారు
భారత పర్యటనలో భాగంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇండియా గేట్ వద్ద స్థానికులతో కాసేపు క్రికెట్ ఆడారు. అనంతరం ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజీలో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. హర్షా భోగ్లే దీనికి కామెంటేటర్‌గా వ్యవహరించారు.

మోడీతో గూగుల్ సీఈఓ: క్రికెట్ ఆడారు
ఈ సందర్భంగా భారత క్రికెట్ దిగ్గజ ఆటగాళ్లైన సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్‌లకు తనో పెద్ద వీరాభిమానినని సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు. గవాస్కర్ క్రికెట్ ఆడిన రోజుల్లోనే కాకుండా ఆ తరువాత కూడా ఆయనకు ఒక పిచ్చి అభిమానిగా ఉండేవాడినని పిచాయ్ తెలిపారు.

మోడీతో గూగుల్ సీఈఓ: క్రికెట్ ఆడారు
ఇంకా చెప్పాలంటే తాను కూడా క్రికెటర్‌ను కావాలనుకున్నానని తన మనసులోని మాటను బయటపెట్టారు. చాలా మంది భారతీయ క్రికెటర్ల వల్లే నాకు కూడా క్రికెటర్‌ను కావాలనే కోరిక అమితంగా ఉండేదని ఓ విద్యార్ధి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆ కలే ఎప్పుడూ నాలో మెదులుతూ ఉండేదన్నారు. ఆ క్రమంలోనే గవాస్కర్ అభిమానిగా మారానని చెప్పుకొచ్చారు.













Click it and Unblock the Notifications