బంపర్ ఆఫర్: రద్దైన నగదు నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకొనే అవకాశం

రద్దుచేసిన పాత నోట్లను బ్యాంకులు, పోస్టాపీసులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకొనే అవకాశాన్ని కల్పించింది కేంద్ర ప్రభుత్వం.

న్యూఢిల్లీ: రద్దుచేసిన పాత నోట్లను బ్యాంకులు, పోస్టాపీసులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకొనే అవకాశాన్ని కల్పించింది కేంద్ర ప్రభుత్వం. నెలరోజుల వరకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

గత ఏడాది నవంబర్ మాసంలో కేంద్ర ప్రభుత్వం పెద్ద నగదు నోట్లను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకొంది.అయితే రద్దుచేసిన నగదును గత ఏడాది డిసెంబర్ 31వ, తేదివరకు బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకొనే వెసులుబాటును కల్పించింది.

అయితే ఎంపిక చేసిన రిజర్వ్ బ్యాంకు శాఖల్లో ఈ ఏడాది మార్చి 31వ, తేదివరకు రద్దుచేసిన పాత నోట్లను డిపాజిట్ చేసే అవకాశాన్ని కూడ కల్పించింది కేంద్రం. అయితే ఈ గడువు దాటినా తర్వాత కూడ ఇంకా దేశవ్యాప్తంగా అనేక చోట్ల పాత నోట్లను మార్పిడి చేసేందుకు ప్రయత్నిస్తున్న సందర్భాలను చూస్తున్నాం.

దీనికితోడు ఎన్ ఆర్ ఐ లు రద్దుచేసిన పాత నగదు నోట్లను మార్పిడిచేసుకొనేందుకు అవకాశం కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది. అయితే దానికి కూడ అనేక నిబంధనలు ఉన్నాయి.అయినా కాని, ఇంకా బ్యాంకులకు చేరని పాత నోట్లు అక్కడక్కడ చెత్తకుప్పల్లో, నదుల్లో పారేసిన ఘటనలు కూడ లేకపోలేదు. దీంతో ప్రభుత్వం మరోసారి అవకాశాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకొంది.

పాతనోట్ల డిపాజిట్ కు మరో అవకాశం

పాతనోట్ల డిపాజిట్ కు మరో అవకాశం

పాతనోట్ల డిపాజిట్ చేసుకొనేందుకు ప్రభుత్వం మరో అవకాశాన్ని కల్పించింది. ఆర్బీఐ, బ్యాంకులు, పోస్టాఫీసులు, జిల్లా సహకార కేంద్రబ్యాంకుల్లో రద్దుచేసి పాత నగదును డిపాజిట్ చేసుకొనేందుకు కేంద్రం అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు మంగళవారం నాడు కేంద్రం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. గత ఏడాది రూ.500. రూ 1000 ల నగదు నోట్లను రద్దుచేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది. దీంతో రద్దుచేసిన పాత నగదు ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్రం సూచించింది.

30 రోజుల గడువు

30 రోజుల గడువు

రద్దుచేసిన పాత నగదు నోట్ల మార్పిడికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ మంగళవారం నాడు అధికారికంగా నోటిఫికేషన్ ను జారీ చేసింది. అధికారిక నోటిఫికేషన్ లో నోట్ల మార్పిడి అంశాన్ని ప్రకటించింది. నెలరోజుల వ్యవధిలోపుగా రద్దుచేసిన నగదును మార్పిడి చేసుకొనేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారంగా ఈ బ్యాంకుల ఖాతా క్రెడిట్ ద్వారా నోట్ల మార్పిడి విలువను పొందవచ్చని ప్రకటించింది.

రైతుల రుణాల కోసమే నిర్ణయం?

రైతుల రుణాల కోసమే నిర్ణయం?

సహకార బ్యాంకుల్లో ఇబ్బడిముబ్బడి ఉన్న పాతనోట్ల నిల్వలు రైతులకు రుణాలందించేందుకు అనేక జిల్లాల కో ఆపరేటివ్ బ్యాంకుల దగ్గర తగిన నిధులు లేవన్న నివేదికల నేపథ్యంలో ఆర్బీఐ నిర్ణయం తీసుకొందన్నారు. దీంతో నగదు కొరతతో ఇబ్బందులు పడుతున్న సహకార బ్యాంకులకు ముఖ్యంగా మహరాష్ట్ర సహకార బ్యాంకులకు భారీ ఉపశమనం లభించనుంది.

నాసిక్ బ్యాంకులో రూ.340 కోట్ల రద్దైన నోట్లు

నాసిక్ బ్యాంకులో రూ.340 కోట్ల రద్దైన నోట్లు

మహరాష్ట్రలోని నాసిక్ జిల్లా సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంకులో రద్దైన పాతనోట్ల విలువ రూ. 340 కోట్లుంటాయని నాసిక్ డిసిసిబి ఛైర్మెన్ నరేంద్ర దరాడే చెప్పారు. సహకార బ్యాంకుల్లో రద్దుచేసిన పాత రూ.500. రూ.1000 నోట్లు కుప్పలు కుప్పలుగా పేరుకుపోయాయి.ఈ డబ్బును మార్పిడి చేయకపోతే చెల్లింపులు కష్టమౌతోందని బ్యాంకుల పాలకవర్గాలు చెబుతున్నాయి. డిమానిటైజేషన్ తర్వాత ఆరుమాసాల తర్వాత పాత కరెన్సీ నిల్వలు భారీగా ఉన్నాయి. మార్పిడికి అవకాశం ఇవ్వాలన్న ప్రతిపాదనను ఆర్బీఐ నిరాకరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+