సడన్ గా లబ్దిదారుల అకౌంట్ లో రూ.2,000 జమ: పింఛన్ + బోనస్
లబ్దిదారులకు ప్రభుత్వం బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది. 2,000 రూపాయల నగదు మొత్తాన్ని అందజేసింది. ఈ మొత్తాన్ని వారి అకౌంట్ లో జమ చేసింది. వృద్ధులు, వితంతువులు, ట్రాన్స్‌జెండర్లు, దివ్యాంగుల కోసం ఉద్దేశించిన మొత్తం ఇది. మార్చి నెల పింఛన్ కు అదనంగా దీన్ని జమ చేసినట్లు వెల్లడించింది ప్రభుత్వం. హోలీ పండగ సమయంలో వారి ఖాతాల్లో ఏకంగా 2,000 రూపాయల మొత్తం జమ కావడం పట్ల హర్షం వ్యక్తమౌతోంది.
ఈ విషయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వెల్లడించారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని తన ఎక్స్ లో పోెస్ట్ చేశారు. మహిళలకు మాత్రమే ఉద్దేశించిన కలైజ్ఞర్ మగళిర్ ఉరిమై తిట్టం పథకాన్ని ఈ వర్గాలకు విస్తరింపజేసినట్లు తెలిపారు. కలైజ్ఞర్ మగళిర్ ఉరిమై తిట్టం పథకం కింద అట్టడుగున ఉన్న వారికి కూడా ప్రత్యేక ఆర్థిక సహాయం అందుతుందని అన్నారు. 2,000 రూపాయల నెలవారీ పెన్షన్ పొందుతున్న వృద్ధులు, వితంతువులు, వృద్ధ ట్రాన్స్‌జెండర్‌లు, దివ్యాంగులకు కూడా ప్రత్యేక ఆర్థిక సహాయం కింద ఈ మొత్తాన్ని అందించినట్లు చెప్పారు.

కలైజ్ఞర్ పథకం పరిధిలోకి తమనూ తీసుకుని రావాలనే డిమాండ్ కొంతకాలంగా వినిపిస్తోంది తమిళనాడులో. ఈ పథకాన్ని మహిళలకు మాత్రమే పరిమితం చేయకుండా పింఛన్ పొందుతున్న అన్ని వర్గాల వారిని కూడా ఇందులో చేర్చాలంటూ స్టాలిన్ ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందాయి. వీటి పట్ల తాజాగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ డిమాండ్‌ను నెరవేర్చినట్లు ఆయన స్పష్టం చేశారు.
అట్టడుగు వర్గాలవారు ఆశించిన విధంగా వారి కోరికను నెరవేర్చామని స్టాలిన్ తెలిపారు. ఆర్థిక ఇబ్బందులను తగ్గించడానికి ప్రత్యేక ఉపశమన చర్య కింద మార్చి పెన్షన్‌తో పాటు 2,000 రూపాయల అదనపు మొత్తాన్ని వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేశామని అన్నారు. వివిధ సామాజిక భద్రతా పథకాల కింద లబ్ధి పొందుతున్న వృద్ధులు, వితంతువులతో సహా మొత్తం 29, 29,000 మంది లబ్దిదారులకు 3,200 రూపాయల చొప్పున విడుదల చేశానని అన్నారు.
దీంతో పాటు ప్రభుత్వం ఏప్రిల్-జూన్ చేపల వేట నిషేధ కాలానికి 1,62,900 మత్స్యకార కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 8,000 రూపాయలు చొప్పున సహాయం ప్రకటించినట్లు స్టాలిన్ తెలిపారు. నీలగిరి జిల్లాలోని 14,870 మంది టీ రైతులకు 8.53 కోట్ల రూపాయల నిధిని కేటాయించారు. ఇది 15 సహకార టీ కర్మాగారాల ద్వారా సేకరించిన పచ్చి టీ ఆకులకు కిలోకు రెండు రూపాయల మొత్తాన్ని కనీస ధరగా వర్తిస్తుంది.
-
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రెండు చోట్ల విజయ్ పోటీ- టీవీకే జాబితా విడుదల: ఒక్క ఛాన్స్ ప్లీజ్ -
DMK మేనిఫెస్టో విడుదల.. సీఎం స్టాలిన్ వరాల జల్లు.. -
తెరపై స్టార్ హీరో + దర్శకుడు: విజయ్ వద్దనుకున్న చోట.. -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై











Click it and Unblock the Notifications