Maldives Vs Lakshadweep: భారత హైకమిషనర్‍కు నోటీసులు జారీ చేసిన మాల్దీవ్స్..
భారత్, మాల్దీవ్స్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతోన్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీపై మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలతో ఈ వివాదం చెలరేగింది. ప్రధానిపై మాల్దీవుల మంత్రులపై వ్యాఖ్యలపై భారత్ సీరియస్ అయింది. ఇండియాలోని మాల్దీవ్ హైకమిషనర్ కు నోటీసులు జారీ చేసింది. దీనికి ప్రతి స్పందనగా మాల్దీవుల ప్రభుత్వం కూడా అక్కడ ఉన్న భారత హైకమిషనర్‌కు సమన్లు జారీ చేసింది.
మాలేలోని భారత హైకమిషనర్ మును మహావార్‌కు ఉత్తర్వులు ఇచ్చింది. వివాదంపై రెండు దేశాలు సుదీర్ఘ చర్చలు జరిపినట్లు సమాచారం. ప్రధాని మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రులపై మాల్దీవుల ప్రభుత్వం వేటు సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించారు. లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ ఆ సందర్భంగా ఆయన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

అవి ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. దీనిపై మాల్దీవుల మంత్రి షియునా .. మోడీని జోకర్‌గా, తోలుబొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేయడంతో వివాదం మొదలైంది. మిగతా మంత్రులు మజీద్, మల్షా కూడా ఇవే రకమైన వ్యాఖ్యలు చేయడంతో భారతీయులు తీవ్రంగా స్పందించారు. బాయ్ కాట్ మాల్దీవ్స్ అని ట్రేడింగ్ లోకి తీసుకొచ్చారు. అంతేకాదు మాల్దీవ్స్ బుక్ చేసుకున్న విమాన టికెట్లను రద్దు చేస్తున్నారు.
మాల్దీవ్స్ వ్యాఖ్యలపై భారత్ లోని ప్రముఖులు సీరియస్ గా స్పందించారు. మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్, సురేష్ రైనా, బాలీడు ప్రముఖులు సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. పర్యాటకులు లక్షద్వీప్ కు వెళ్లాలని సూచించారు. దీంతో 2500 విమాన టికెట్లు భారతీయులు క్యాన్సల్ చేసుకున్నట్లు సమాచారం. కొందరైతే రద్దు చేసుకున్న విమాన టికెట్ల స్క్రీన్ షార్ట్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications