తీరనున్న కరెన్సీ కష్టాలు: రూ.500 కరెన్సీ నోట్ల ముద్రణ ఐదు రెట్ల పెంపు

Posted By:
Subscribe to Oneindia Telugu
  Good News For ATM Users

  న్యూఢిల్లీ: దేశంలో నగదు కొరతను తీర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలను ప్రారంభించింది. రూ.500 నోట్ల ప్రింటింగ్‌ను ఐదు రెట్లు ఎక్కువ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు ఆర్ధిక వ్యవహరాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ ప్రకటించారు.

  డిమాండ్‌కు తగ్గట్టుగానే కరెన్సీ సరఫరాను మరింత పెంచేందుకు చర్యలు తీసుకొంటామని ఆయన ప్రకటించారు. దేశంలోని పలు ప్రాంతాల్లో నగదు కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొన్నట్టుగా ఆయన ప్రకటించారు.

  Government to up printing of Rs 500 notes to tackle cash crunch: DEA Secretary

  మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.వచ్చే రెండు రోజుల్లో రోజుకు రూ.2500 కోట్ల విలువైన 500 రూపాయల నోట్లను సరఫరా చేయనున్నట్టు తెలిపారు
  దీంతో నెలకు సరఫరా రూ.70వేల కోట్ల నుంచి రూ.75వేల కోట్ల వరకు ఉంటుందన్నారు.

  డిమాండ్‌కు మించి ఇప్పటికే నగదు స్టాక్ ఉందని ఆయన చెప్పారు.డిమాండ్‌కు మించి రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు కరెన్సీ స్టాక్‌ ఉందని, గత కొన్ని రోజులుగా ఈ నగదును సిస్టమ్‌లోకి పంపించామని, ఇంకా రూ.1.75 లక్షల కోట్ల రిజర్వులు తమ వద్ద ఉన్నాయని ఆయన చెప్పారు. కానీ గత రెండు నెలల నుంచి అసాధారణంగా ఎక్కువ డిమాండ్ ఏర్పడిందన్నారు.

  ఈ అసాధారణ డిమాండ్‌ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్నాటక, మధ్యప్రదేశ్‌, బిహార్‌ వంటి రాష్ట్రాల్లో చోటు చేసుకుందని ఆర్థికమంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కొరత తాత్కాలికమేననీ త్వరలోనే పరిస్థితి చక్కబడుతుందంటూ కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ ట్వీట్‌ కూడా చేసిన విషయం తెలిసింది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  To meet the "unusual" currency demand in the country, the government has decided to increase printing of Rs 500 notes by five times, Economic Affairs Secretary Subhash Chandra Garg said here on Tuesday.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి