వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేడే బలప్రదర్శన: శశికళకు పట్టం కడతారా? పన్నీరునే నిలబెడతారా?

తమిళనాడు ముఖ్యమంత్రి పదవి కోసం సాగుతున్న పోరాటంలో ప్రస్తుత అపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం పైచేయి సాధిస్తారా? లేక అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ తన పట్టు .

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పదవి కోసం సాగుతున్న పోరాటంలో ప్రస్తుత అపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం పైచేయి సాధిస్తారా? లేక అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ తన పట్టు కొనసాగించి సీఎం పదవిని చేపడతారా? అనే విషయంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అయితే, గవర్నర్ విద్యాసాగర్ రావు గురువారం తమిళనాడుకు రానున్న నేపథ్యంలో ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంది.

గవర్నర్‌ మధ్యాహ్నం రెండు గంటలకు శశికళ, ఆమెకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలను కలిసేందుకు సమయమిచ్చారు. అన్నాడీఎంకేలో తిరుగుబాటు బావుటా ఎగరేసిన పన్నీర్‌సెల్వం, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళలు రెండు శిబిరాలుగా విడిపోయి బుధవారం ఉదయం నుంచీ క్యాంపు రాజకీయాలు నిర్వహిస్తూ రాజకీయాన్ని వేడెక్కించారు.

శశికళకు పన్నీరుసెల్వం మరో షాక్: గతంలో జయకు శశికళ లేఖ, ఏముందంటే..?శశికళకు పన్నీరుసెల్వం మరో షాక్: గతంలో జయకు శశికళ లేఖ, ఏముందంటే..?

బుధవారం ఉదయం తన నివాసంలో మీడియాతో మాట్లాడిన పన్నీర్‌సెల్వం రాష్ట్రానికి ఇప్పటికీ తానే ముఖ్యమంత్రినని ప్రకటించారు. అదే సందర్భంలో శశికళపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. తాను ఎవరికీ భయపడనని, శాసననసభలో బల పరీక్షకు సిద్ధమని సవాల్‌ విసిరారు. మరోవైపు పన్నీరు తిరుగుబాటుతో అప్రమత్తమైన శశికళ బుధవారం ఉదయం అన్నాడీఎంకే కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు.

సమావేశానికి తంబిదురై, పార్టీ ప్రిసీడియం ఛైర్మన్‌ మధుసూధనన్‌ లాంటి సీనియర్‌ నేతలు, మొత్తం 129 మంది శాసనసభ్యులు హాజరయ్యారు. వారందర్నీ శశికళ వర్గం ఏసీ బస్సుల్లో విమానాశ్రయానికి దగ్గరగా ఉన్న ఒక హోటల్‌కు తరలించి అక్కడ క్యాంపు ఏర్పాటు చేసింది.

గవర్నర్ రాకతో ఆసక్తి

గవర్నర్ రాకతో ఆసక్తి

తమిళనాట చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ఇంఛార్జి గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు గురువారం సాయంత్రం చెన్నైకి రానున్నారు. ఆయన ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఎలాంటి అడుగులు వేస్తారనేది అసక్తిగా మారింది.

ఉత్కంఠ

ఉత్కంఠ

గవర్నర్.. శశికళను ప్రమాణ స్వీకారం చేయడానికి ఆహ్వానిస్తారా, లేక పన్నీర్‌సెల్వంను శాసనసభలో బలపరీక్ష నిరూపించుకోవాలని కోరతారా అనేది చర్చనీయాంశమైంది. ఇప్పటికే పన్నీర్‌సెల్వం రాజీనామాను ఆమోదించడంతో గవర్నర్‌ ఎలాంటి వ్యూహం అనుసరిస్తారనేదానిపై ఉత్కంఠ నెలకొంది.

గవర్నర్‌ను శశికళ

గవర్నర్‌ను శశికళ

గురువారం గవర్నర్‌ను కలవనున్న శశి.. శశికళ ఎమ్మెల్యేలతో జరిపిన సమావేశంలో పన్నీరు సెల్వంపైన, అన్నాడీఎంకేను చీల్చే కుట్రలు చేస్తున్నారని డీఎంకేపైనా విరుచుకుపడ్డారు. తమకు 131 మంది ఎమ్మెల్యేల మద్దతుందని శశికళ శిబిరం ప్రకటించింది. గవర్నర్‌ తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఈ సమావేశం కోరింది. తనకు మద్దతిస్తున్న శాసనసభ్యులందర్నీ తీసుకుని గురువారం శశికళ గవర్నర్‌ను కలవనున్నారు.

చిన్నమ్మ వ్యతిరేకులే పన్నీరుకు బలం

చిన్నమ్మ వ్యతిరేకులే పన్నీరుకు బలం


తమిళనాట ఇప్పుడు శశికళ వ్యతిరేకులంతా ఏకమై పన్నీరుసెల్వంకు బాసటగా నిలుస్తుండటం గమనార్హం. ఆయనకు అవసరమైతే మద్దత్విడానికి డీఎంకే సిద్ధంగా ఉంది. కాంగ్రెస్‌ కూడా ఆయనపక్షానే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం తన శిబిరంలో నలుగురు ఎమ్మెల్యేలను మాత్రమే కలిగి ఉన్న ఓపీఎస్‌ మరికొంత మంది ఎమ్మెల్యేలు తనతో వచ్చి చేరతారని భావిస్తున్నారు. కాగా, అన్నాడీఎంకే సీనియర్‌ నేత పీహెచ్‌ పాండియన్‌, రాజ్యసభ సభ్యుడు మైత్రేయన్‌ పన్నీర్‌ నివాసానికి చేరుకుని ఆయనకు మద్దతు ప్రకటించారు.

స్టాలిన్ వ్యూహాలు

స్టాలిన్ వ్యూహాలు

డీఎంకే నేత ఎం.కె.స్టాలిన్‌ బుధవారం ఉదయం కరుణానిధితో భేటీ జరిపి అనుసరించాల్సిన వ్యూహాలపై సమాలోచనలు జరిపారు. గవర్నర్‌ వెంటనే రాష్ట్రానికి వచ్చి ఇక్కడి రాజకీయ అనిశ్చితికి ముగింపు పలకాలని డిమాండ్‌ చేశారు. శశికళను వ్యతిరేకిస్తూ.. పన్నీరు సెల్వంకు మద్దతిచ్చినప్పటికీ.. అన్నాడీఎంకేలో చీలికను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో వెనుకడుగు వేయమని కూడా స్టాలిన్ స్పష్టం చేయడం గమనార్హం.

English summary
Tamil Nadu’s caretaker chief minister O Panneerselvam on Wednesday ordered an inquiry into the death of his mentor J Jayalalithaa, intensifying a high-stakes revolt against AIADMK general secretary VK Sasikala whose potential elevation to the top post has sparked a political crisis in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X