వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిజోరం గవర్నర్ రాజీనామా: బాధ్యతలు తీసుకున్న 10 నెలల వ్యవధిలోనే..

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: మిజోరం గవర్నర్ కమ్మనం రాజశేఖరన్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు అందజేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి వెంటనే ఆమోదించారు. మిజోరం బాధ్యతలను అస్సాం గవర్నర్ జగదీష్ ముఖికి అప్పగించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఆదేశాలు జారీ చేసింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి.. ఇంత హడావుడిగా రాజీనామా చేయడం వెనుక పెద్ద కథే ఉంది.

Governor of Mizoram has resigned from his office

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రాజశేఖరన్ బీజేపీ తరఫున పోటీ చేయాలని నిర్ణయించుకోవడమే దీనికి అసలు కారణం. కేరళకు చెందిన రాజశేఖరన్ చాలాకాలంగా బీజేపీలో కొనసాగుతున్నారు. బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ పదవిలో ఉన్న సమయంలోనే.. కేంద్రప్రభుత్వం రాజశేఖరన్ పేరును గవర్నర్ గా నామినేట్ చేసింది. ఈ ప్రతిపాదనలను రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. దీనితో ఆయన గత ఏడాది మే 25వ తేదీన మిజోరం గవర్నర్ గా బాధ్యతలను స్వీకరించారు.

22 ఉగ్రవాద శిక్షణ కేంద్రాలు..! అందులో జైషే మహ్మద్ సంస్థలెన్నో తెలుసా? 22 ఉగ్రవాద శిక్షణ కేంద్రాలు..! అందులో జైషే మహ్మద్ సంస్థలెన్నో తెలుసా?

ఏడాది పాటు కూడా లేరు..

గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన రాజశేఖరన్ కనీసం ఏడాది పాటు కూడా ఆ పదవిలో గడపలేకపోయారు. బీజేపీ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఆయన తన పదవికి రాజీనామా చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆయన తిరువనంతపురం స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.

Governor of Mizoram has resigned from his office

శశిథరూర్ పై పోటీకి సై..

తిరువనంతపురం లోక్ సభ స్థానం.. కాంగ్రెస్, కమ్యూనిస్టులకు కంచుకోట. గెలుపోటములు ఈ రెండు పార్టీల మధ్యే తిరుగాడుతోంది. ఒక్కసారి కూడా బీజేపీ ఈ స్థానాన్ని కైవసం చేసుకోలేదు. ప్రస్తుతం తిరువనంతపురం స్థానం కాంగ్రెస్ చేతిలో ఉంది. శశిథరూర్ ఇక్కడ లోక్ సభ సభ్యుడు. ఈ సారి కూడా శశిథరూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఇదే స్థానం నుంచి పోటీ చేయడం ఖాయం.

కాంగ్రెస్, వామపక్షాలపై బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని బీజేపీ భావిస్తోంది. ప్రస్తుతం బీజేపీకి ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం రాజశేఖరనే. దీన్ని దృష్టిలో ఉంచుకుని మిజోరం గవర్నర్ గా ఉన్న ఆయనతో రాజీనామా ఇప్పించింది. ఫలితంగా ఆయన మరోసారి క్రియాశీలకంగా వ్యవహరిస్తారని పార్టీ భావిస్తోంది.

English summary
Kummanam Rajasekharan, the Governor of Mizoram, has resigned from his office on Friday and the President of India has accepted his resignation. Kummanam, the former Kerala State BJP president, had been sworn in as Mizoram Governor on May 25, 2018. President Ram Nath Kovind has appointed Jagdish Mukhi, Governor of Assam, to discharge the functions of the Governor of Mizoram, in addition to his own duties, until regular arrangements for the office of the Governor of Mizoram is made.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X