డిజిటల్ ప్రోత్సాహం: రూ.1000మించితే ఛార్జీలు వద్దన్న కేంద్రం
డిజిటల్ ప్రోత్సాహం: రూ.1000మించితే ఛార్జీలు వద్దన్న కేంద్రం
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు తర్వాత ప్రజలను డిజిటల్ లావాదేవీల వైపు మళ్లించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తోంది. తాజాగా ఈ అంశంపై ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేసింది.

ఖాతాదారులు రూ.వెయ్యికి పైగా జరిపిన ఆన్‌లైన్ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేయొద్దని ఆదేశించింది. ఐఎంపీఎస్, యూపీఐ, ఎన్‌ఈఎఫ్‌టీపై ఎలాంటి రుసుముల విధించొద్దని ఆదేశాలు జారీ చేసింది.
దీంతో రూ. 1000కిపైగా చేసిన డిజిటల్ లావాదేవీలపై ఛార్జీలు అత్యంత తక్కువగా, లేదా వసూలు చేసే అవకాశం ఉండదు. అయితే, ఈ ఛార్జీల అమలు ఎప్పట్నుంచి అమల్లోకి వస్తుందనేదానిపై స్పష్టత లేదు.












Click it and Unblock the Notifications