గోనె సంచి మాస్క్ గా కట్టుకున్న తాత .. కరోనా కాదు దాని జేజమ్మ కూడా రాదన్న నెటిజన్లు
కరోనా వైరస్ రోజు రోజుకు ప్రపంచాన్ని వణికిస్తుంది . ఇక భారత్ లో సైతం కరోనా తన ప్రతాపాన్ని చూపిస్తుంది . ఇప్పటికే ఇండియాలో 873కేసులు నమోదు కాగా ప్రభుత్వాలు కరోనా నియంత్రణకు నానా తిప్పలు పడుతున్నారు . ఇక కరోనా వ్యాప్తిని అరికట్టటానికి మార్చి 22 వ తేదీ నుంచి దేశంలో లాక్ డౌన్ విధించారు. లాక్ డౌన్ విధించడంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు .
ఒకవేళ బయటకు వచ్చినా ముఖానికి మాస్క్ లు కట్టుకోకుండా ఎవరూ కూడా బయటకు అడుగుపెట్టడం లేదు. ఇక దీంతో దేశంలో మాస్క్ ల కొనుగోలు విపరీతంగా పెరిగింది. మాస్కుల ధరలు కూడా బాగా పెరుగుతున్న పరిస్థితి . ఇక చాలా గ్రామాల్లో మాస్క్ లు అందుబాటులో లేకుంటే కనీసం రుమాలైన, లేదా కండవా అయినా ముఖానికి కట్టుకుంటున్నారు. అయితే, ఒక తాత మాత్రం వినూత్నంగా కట్టుకున్న మాస్క్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.

అందరూ మాస్కులు లేదా రుమాళ్ళు మాస్కులుగా కట్టుకుంటే ఒక తాత ఏకంగా ఒక గోనె సంచినే మాస్క్ గా కట్టుకున్నారు . ఇక తాత కట్టుకున్న మాస్క్ తో కరోనా కాదు కదా కనీసం కరోనా జేజెమ్మ కూడా అతని దగ్గరకు అడుగుపెట్టడానికి భయపడుతుంది అని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతుంది . ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఖాళీగా కూర్చుంటున్న ప్రజల క్రియేటివిటీ సోషల్ మీడియా వేదికగా ప్రదర్శిస్తున్నారు. కరోనా వైరస్ పై జోక్స్ , మీమ్స్ , టిక్ టాక్ వీడియోలు తెగ హంగామా చేస్తున్న పరిస్థితి ఇప్పుడు దేశ వ్యాప్తంగా కనిపిస్తుంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ వార్ పై ప్రధాని సమీక్ష-చమురు, గ్యాస్, ఎరువులపై కీలక నిర్ణయాలు ? -
ఇరాన్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్.. కీలక విషయాలపై చర్చ -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications