కట్నం అడిగిన సోదరులు: పెళ్లి రోజే జైలు పాలయ్యారు

 jail
లక్నో/న్యూఢిల్లీ: అంతాసవ్యంగా జరిగితే తమ పెళ్ళిల్లు జరిగి ఆనందంగా ఉండాల్సిన ఇద్దరు సోదరులు అదనపు కట్నం కోసం ఆరాటపడి కటకటాల పాలయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధురలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధురకు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లకు కుర్సందా గ్రామానికి చెందిన రవి, అజిత్ అనే అన్నదమ్ములతో వివాహం జరపాలని పెద్దలు నిశ్చయించారు.

పెళ్లి మండపానికి చేరుకున్న ఇద్దరు పెళ్లి కొడుకులు అతనపు కట్నంగా రూ. లక్ష ఇవ్వాలని, మోటార్ సైకిల్ ఇవ్వాలని గొడవకు దిగారు. ముందు ఒప్పుకున్న మేరకే కట్నం ఇవ్వగలమని అదనపు కట్నం ఇవ్వలేమని వధువుల తరపు వారు చెప్పడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఘర్షణలో ఆరుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి.

దీంతో వధువుల తల్లి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఇద్దరు పెళ్లి కొడుకులను అరెస్ట్ చేశారు. తాము ఒప్పించడానికి ఎంత ప్రయత్నించినా కుదరకపోవడంతోనే పోలీసులకు సమాచారం ఇచ్చామని వధువుల తల్లి పేర్కొంది.

అత్యచారం కేసులో నిందితునికి జీవిత ఖైదు

న్యూఢిల్లీ: ప్రభుత్వాధికారిని చెప్పుకుంటూ.. ఓ ఇంట్లోని బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితునికి ఢిల్లీ కోర్టు యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. ఇది చాలా క్రూరమైన చర్యగా తీర్పు వెలువరించిన సందర్భంలో కోర్టు తెలిపింది. అతడి పట్ల జాలి చూపించేందుకు కోర్టు నిరాకరించింది. గతంలోనూ అతడు అత్యాచారం కేసులోనే అరెస్ట్ అయి, బెయిల్‌పై విడుదలయ్యాడు. ఆ తర్వాత కూడా అతని బుద్ధి మారలేదు. ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ నేరాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న కోర్టు అతని పట్ల జాలిచూపించలేమని స్పష్టం చేసింది.

నిందితుడు అన్వర్ ఉల్ హక్‌కు ఇద్దరు కుమార్తెలు ఉన్నప్పటికీ అతడు ఇలాంటి వైఖరిని కలిగి ఉండటం క్షమార్హం కాదని కోర్టు పేర్కొంది. అతనికి రూ. 11వేల రూపాయల జరిమానా విధించింది. అంతేగాక బాధితురాలికి రూ. 2 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని, ఆమెకు పునరావాసం కల్పించాలని కోర్టు ఆదేశించింది. 2010 జూన్ నెలలో నిందితుడు అన్వర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. జరిగిన విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలపడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు జరిపిన పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+