‘నోటి దురుసు వల్లే సిద్దరామయ్య ఓటమి’
కర్ణాటక ఎన్నికల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు చుక్కదురైంది. తాజా ఎన్నికల్లో ఆయన రెండు చోట్ల నుంచి బరిలోకి దిగారు. బాగల్‌కోట్ జిల్లాలోని బాదామి నియోజకవర్గం నుంచి, అలాగే చాముండేశ్వరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి దిగారు.
People have rejected Siddaramaiah. He lost because of his attitude, because of attacking everyone & because of his loose talk: GT Devegowda, JD(S) candidate who is leading over Siddaramaiah in Chamundeshwari by 17000 votes. pic.twitter.com/6Sw82tiBgs
— ANI (@ANI) May 15, 2018
మంగళవారం నాటి ఎన్నికల ఫలితాల్లో చాముండేశ్వరి స్థానం నుంచి జేడీఎస్ అభ్యర్థి జీటీ దేవగౌడ చేతిలో సిద్ధరామయ్య 17 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.

చాముండేశ్వరిలో విజయం సాధించిన అనంతరం దేవేగౌడ మీడియాతో మాట్లాడుతూ.. సిద్ధరామయ్యను ప్రజలు తిరస్కరించారు. ఆయన ప్రవర్తన, వ్యవహారశైలి కారణంగా ఓటమి పాలయ్యారు. ప్రతిఒక్కరిపై మాటల దాడి చేయడం, నోటిదురుసుతనం కారణంగానే ఓడిపోయారు అని అన్నారు.
ఇక బాదామి నియోజకవర్గంలో ఎంపీ బీ శ్రీరాములుపై సిద్ధరామయ్య గెలుపొందారు. మైనింగ్ దిగ్జజం గాలి జనార్ధన్‌రెడ్డికి అతిసన్నిహితుడైన బీ శ్రీరాములు ఓటమి పాలు కావడం రాజకీయవర్గాలను షాక్ గురిచేసింది.












Click it and Unblock the Notifications