వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అగ్నివీరులకు హర్యానా ప్రభుత్వంలో గ్యారెంటీ ఉద్యోగాలు; వారికి ఉద్యోగభరోసా ఇస్తున్న రాష్ట్రాలివే!!

|
Google Oneindia TeluguNews

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ ఆర్మీ రిక్రూట్మెంట్ స్కీమ్ పై దేశ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బిజెపి పాలిత రాష్ట్రాలలో అగ్నిపథ్ ఆర్మీ రిక్రూట్మెంట్ స్కీమ్ ను స్వాగతిస్తుండగా, బిజెపియేతర రాష్ట్రాలలో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ పథకం వల్ల నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగుల ఆందోళన శాంతింప చేయడానికి అగ్నిపథ్ పథకంపై అనేక కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇక అనేక రాష్ట్రాలు కూడా అగ్నివీరుల ఉద్యోగాలకు భరోసా ఇస్తున్నాయి.

అగ్నివీర్స్ కోసం ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్న రాష్ట్రాలు

అగ్నివీర్స్ కోసం ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్న రాష్ట్రాలు

నాలుగు సంవత్సరాల పాటు సాయుధ దళాలకు సేవలందించిన "అగ్నివీర్స్" పోలీసు బలగాలలో ఖాళీలను భర్తీ చేసేటప్పుడు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) అలాగే అనేక రాష్ట్రాలు ప్రకటించాయి. అనేక ఇతర శాఖలు కూడా అగ్నిపథ్ పథకానికి మద్దతు ప్రకటించాయి. మూడు సర్వీసులలో నాలుగు సంవత్సరాల పదవీకాలం పూర్తయిన తర్వాత "అగ్నివీర్స్" కోసం ఉద్యోగ అవకాశాలను ఇస్తామని పేర్కొన్నాయి.

అగ్నివీర్స్ కు ఉదోగ్యాలు .. యూపీ సీఎం హామీ, కర్ణాటకలోనూ సానుకూల స్పందన

అగ్నివీర్స్ కు ఉదోగ్యాలు .. యూపీ సీఎం హామీ, కర్ణాటకలోనూ సానుకూల స్పందన

తమ పదవీకాలం విజయవంతంగా పూర్తి అయితే అగ్నివీరులకు పోలీసు మరియు అనుబంధ శాఖల ఉద్యోగాలకు అత్యధిక ప్రాధాన్యత లభించేలా చేస్తామని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ యువతకు హామీ ఇచ్చారు. ప్రత్యేక 'అగ్నిపథ్' పథకం కింద స్వల్పకాలిక ఒప్పందంపై ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో రిక్రూట్ అయిన 'అగ్నివీర్స్', సైనికులకు పోలీసు సర్వీసుల రిక్రూట్‌మెంట్‌లో ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోందని కర్ణాటక హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర తెలిపారు. మిలిటరీలో శిక్షణ పొందిన సిబ్బందిని (అగ్నివీర్స్) పోలీసు సేవల్లోకి చేర్చుకోవాలని భావిస్తున్నామని పేర్కొన్నారు.

పోలీస్ ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇస్తామని చెప్పిన ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్

పోలీస్ ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇస్తామని చెప్పిన ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్


అగ్నిపథ్ పథకంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అగ్నిపథ్ పథకం కింద దేశానికి సేవ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పోలీసు, విపత్తు నిర్వహణ, చార్ ధామ్ యాత్ర నిర్వహణ వంటి అనేక సేవలలో అగ్నివీరులకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, అందుకు సంబంధించిన నిబంధనలు ఉంటాయని ధామి తెలిపారు. సాయుధ బలగాల్లో విధులు పూర్తి చేసిన సైనికులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు పోలీసు ఉద్యోగాల్లోనూ ప్రాధాన్యత ఉంటుందని అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ హామీ ఇచ్చారు.

అస్సాంలోనూ, మధ్యప్రదేశ్ లోనూ వారి భవిష్యత్ కు భరోసా

అస్సాంలోనూ, మధ్యప్రదేశ్ లోనూ వారి భవిష్యత్ కు భరోసా

కేంద్రం యొక్క అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, రాష్ట్రంలో శాశ్వత నివాసి అయిన ప్రతి 'అగ్నివీర్' వారి నాలుగేళ్ల పదవీకాలం ముగిశాక నేరుగా రాష్ట్ర పోలీసుశాఖలో చేరతారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు. అగ్నిపథ్ నుండి బయటకు వచ్చే ఎవరైనా వారికి రాష్ట్ర పోలీసు శాఖలో ఉద్యోగం ఇవ్వబడుతుంది. అగ్నిపథ్ పథకం కింద రిక్రూట్ అయిన సైనికులకు రాష్ట్రంలో పోలీసు రిక్రూట్‌మెంట్‌లో ప్రాధాన్యత ఇవ్వబడుతుందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.

హర్యానా ప్రభుత్వం గ్యారెంటీగా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగం ఇస్తామని ప్రకటన

హర్యానా ప్రభుత్వం గ్యారెంటీగా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగం ఇస్తామని ప్రకటన

ఇదిలా ఉంటే తాజాగా అగ్ని వీరులుగా పనిచేసి పదవీ విరమణ చేసిన అగ్నివీరులకు హర్యానా ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మంగళవారం ప్రకటించారు. "గ్రూప్ సి ఉద్యోగం అయినా లేదా హర్యానా పోలీస్‌ శాఖలో అయినా, ఎవరు అగ్నివీర్ ప్రోగ్రామ్ నుండి తిరిగి వచ్చి హర్యానా ప్రభుత్వంలో పని చేయాలనుకుంటే, వారికి గ్యారంటీ ఉద్యోగం ఇవ్వబడుతుంది" అని మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు.

English summary
CM Manohar Lal Khattar said the agniveers would be given guaranteed jobs in the Haryana government after they retire. The states of UP, Assam, Arunachal Pradesh, Madhya Pradesh, Uttarakhand and Karnataka are also giving them job security.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X