గుజరాత్ లో బీజేపీకి షాకులు-దూరమవుతున్న వర్గాలు-మత్సకారుల్ని ఆకట్టుకునే యత్నం
ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వానికి షాకులు తప్పడం లేదు. ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ పనితీరుపై ఆగ్రహంగా ఉన్న పలు వర్గాలు ఆ పార్టీకి దూరమయ్యాయి. దీంతో ఎన్నికలకు ముందు వారిలో కొందరినైనా తిరిగి తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ సర్కార్ చివరి ప్రయత్నాలు చేస్తోంది.
గుజరాత్ లోని తీర ప్రాంతాల్లో ప్రభావిత వర్గమైన మత్సకారులు బీజేపీకి క్రమంగా దూరమవుతున్నారు. దీంతో వారిని తిరిగి తమవైపు తిప్పుకోవాలనే ఒత్తిడి ప్రభుత్వంపై పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ సర్కార్ మత్సకారులకు ఈరటనిచ్చేలా ఓ నిర్ణయం తీసుకుంది. మత్సకారులకు ఇస్తున్న డీజిల్, కిరోసిన్ కోటా పెంచుతూ గుజరాత్ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 9 నియోజకవర్గాల్లో మత్సకారులు ప్రభావం చూపే అవకాశాలున్నాయి. దీంతో వీరిని ఆకట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.

మరోవైపు గుజరాత్ లో మత్సకారులు ప్రభుత్వ గుర్తింపు పొందిన పెట్రోల్ బంకుల్లో సబ్సిడీపై డీజిల్ తీసుకునేందుకు అవకాశం కల్పించారు. గతంలో గుజరాత్ ప్రభుత్వ మత్సశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే బంకుల్లోనే డీజిల్ ఇలా సబ్సిడీపై తీసుకునే అవకాశం ఉండేది. తాజాగా దాన్ని సవరించారు. గుజరాత్ ప్రభుత్వం తాజా ప్రకటన ప్రకారం మత్సకారులకు ఇచ్చే డీజిల్, కిరోసిన్ సబ్సిడీని వ్యాట్ రిబేట్ రూపంలో ఇవ్వనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో గరిష్టంగా లీటరుకు రూ.15 మేర వారికి ప్రయోజనం కలగబోతోంది. అలాగే ఆన్ బోర్డ్ మోటార్ బోట్లకు ప్రస్తుతం కిరోసిన్ కు ఇస్తున్న రూ.25 సబ్సిడీని రూ.50 కు పెంచారు. కిరోసిన్ సబ్సిడీ పథకంలోనే పెట్రోల్ తో నడిచే బోట్లకూ నిబంధనలు వర్తించేలా సవరణలు చేశారు.













Click it and Unblock the Notifications