వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేపే గుజరాత్ ఎన్నికల తొలి సమరం, సీఎంతో సహ 997 మంది, 2.16 కోట్ల ఓటర్లు!

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: గుజరాత్‌ శాసన సభ ఎన్నికల తొలి సమరానికి సర్వం సిద్ధం అయ్యింది. గుజరాత్ శాసన సభ తొలి దశ ఎన్నికలు శనివారం జరగనున్నాయి. గుజరాత్ లో మొత్తం 182 శాసన సభ నియోజక వర్గాలు ఉన్నాయి. శనివారం 89 శాసన సభ నియోజక వర్గాల్లో పోలింగ్ జరగనుంది.

సీఎంతో సహ 977 మంది

సీఎంతో సహ 977 మంది

శనివారం జరగనున్న పోలింగ్ లో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో సహ మొత్తం 977 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తొలి దశ ఎన్నికల్లో 57 మంది మహిళలు బరిలో ఉన్నారు. మొత్తం 2.12 కోట్ల మంది వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

 400 మంది రెబల్స్

400 మంది రెబల్స్

బీజేపీ 89 స్థానాల్లో, కాంగ్రెస్ 87 స్థానాల్లో, బీఎస్పీ 64, ఎన్సీపీ 30 స్థానాల్లో పోటీపడుతోంది. బరిలో ఉన్న అభ్యర్థుల్లో నాలుగు వందల మందికి పైగా స్వతంత్రంగా పోటీచేస్తున్న వారు ఉన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ రాజ్‌కోట్‌ పశ్చిమ నియోజక వర్గం నుంచి బరిలో ఉన్నారు. ఇక కాంగ్రెస్‌ నుంచి పలువురు ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

హోరా హోరీ

హోరా హోరీ

తొలి దశ ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసింది. అటు గుజరాత్ లో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ నువ్వా నేనా అన్నట్లుగా హోరాహోరీగా ప్రచారం చేశాయి. విమర్శలు, ప్రతి విమర్శలతో ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగింది.

ఐదు సారి బీజేపీ!

ఐదు సారి బీజేపీ!

గుజరాత్ లో అధికారంలో ఉన్న బీజేపీ రెండు దశాబ్దాలకు పైగా ఇక్కడ మాకు తిరుగులేదని నిరూపించింది. దీంతో ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ వరుసగా ఐదోసారి కూడా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నది.

ఒక్క చాన్స్ ఇవ్వండి

ఒక్క చాన్స్ ఇవ్వండి

మరోవైపు ఏళ్ల తరబడి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఈ సారైనా అధికారాన్ని దక్కించుకోవాలని ఆశపడుతోంది. మరోవైపు త్వరలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టబోయే యువరాజు రాహుల్‌ గాంధీకి ఈ ఎన్నికలే తొలి సవాలుగా నిలిచాయి.

English summary
Gujarat goes to the polls on Saturday for the first phase of the assembly election being held in 89 seats of Saurashtra and South Gujarat regions with 977 candidates in the fray.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X