షాకింగ్: అప్పుడే పుట్టిన కవలలకు సోకిన కరోనా: పసికందుల్లో ఒకేరకమైన లక్షణాలు..తల్లిలో!
అహ్మదాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి సెకెండ్ వేవ్.. దేశంలో పెను ప్రభావాన్ని చూపుతోంది. రోజువారీ పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇదివరకటితో పోల్చుకుంటే.. దీని తీవ్రత ఉధృతంగా ఉంటోంది. ప్రత్యేకించి- మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, మధ్యప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఊహించని రీతిలో వైరస్ వ్యాప్తి చెందుతోంది. ప్రజలను బెంబేలెత్తిస్తోంది. ఫలితంగా- దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసులు మళ్లీ మొదటికొచ్చాయి. యాక్టివ్ కేసుల సంఖ్య ఆరు లక్షలకు చేరువ అవుతోంది.
తాజాగా గుజరాత్‌లోని వడోదరలో కవలలకు కరోనా వైరస్ సోకడం కలకలం రేపుతోంది. అప్పుడే పుట్టిన పసిగుడ్డులు వైరస్ బారిన పడటం డాక్టర్లకు దిగ్బ్రాంతికి గురిచేసింది. ఈ కవలలు జన్మించిన 15 రోజుల వ్యవధిలోనే తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. విరేచనాలతో బాధపడుతున్నారు. డీహైడ్రేషన్‌కు గురయ్యారు. దీనితో డాక్టర్లు వారిని చికిత్స నిమిత్తం వడోదరాలోని ఎస్ఎస్‌జీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి పరీక్షలు నిర్వహించగా.. కరోనా సోకినట్లు తేలింది. ప్రస్తుతం ఆ ఇద్దరు పసికందుల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి పీడియాట్రిక్స్ హెడ్ డిపార్ట్‌మెంట్ డాక్టర్ అయ్యర్ తెలిపారు.

ఆ కవలల తల్లికి కరోనా వైరస్ సోకలేదని తేలింది. ఆమెలో కరోనా వైరస్ లక్షణాలేవీ కనిపించలేదని డాక్టర్లు పేర్కొన్నారు. బంధువుల నుంచి ఆ కవలలకు కరోనా వైరస్ సోకి ఉండొచ్చని భావిస్తున్నారు. కవలలను ఎత్తుకున్న సందర్భంలో వారికి వైరస్ సోకి ఉండొచ్చని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారు. గురువారం నుంచే ఈ విధానం అమల్లోకి వచ్చింది. అయినప్పటికీ- కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు.

గురువారం విడుదల చేసిన బులెటిన ప్రకారం.. గుజరాత్‌లో 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,410 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అహ్మదాబాద్‌లో 613 కేసులు రికార్డయ్యాయి. ముగ్గురు మరణించారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) అహ్మదాబాద్ క్యాంపస్‌లో పలువురు విద్యార్థులు కరోనా వైరస్ బారిన పడ్డారు. 97 మంది విద్యార్థులకు కరోనా వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. క్యాంపస్‌లోనే మైక్రో కంటైన్‌మెంట్ క్వారంటైన్‌ను ఏర్పాటుచేశారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications