వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన రవీంద్ర జడేజా భార్య రివాబా

|
Google Oneindia TeluguNews

గాంధీనగర్: భారత క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా జడేజా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. జామ్‌నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆమె సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు రివాబా తన భర్త రవీంద్ర జడేజాతో కలిసి బ్లోయింగ్ ది బగల్ ఈవెంట్‌లో పాల్గొన్నారు.

తన భార్య తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తోందని, ఆమె చాలా నేర్చుకుంటోందని రవీంద్ర జడేజా తెలిపారు. రివాబాది సహాయం చేసే గుణమని, ఆమె ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. ప్రజల కోసం పనిచేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ బాటలోనే రివాబా కూడా నడుస్తుందని జడేజా తెలిపారు.

 Gujarat polls 2022: Ravindra Jadeja’s wife Rivaba files nomination from Jamnagar North

అంతకుముందు జడేజా తన భార్య రివాబాను గెలిపించాలని కోరుతూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు టీ20 మ్యాచ్‌లా ఉన్నాయి. బీజేపీ టికెట్ పై రివాబా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. జామ్‌నగర్ ప్రజలు, క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొని ఆమెకు మద్దతునివ్వాలని కోరారు రవీంద్ర జడేజా.


కాగా, పారిశ్రామికవేత్త కుమార్తె రివాబా ఏప్రిల్ 17, 2016న క్రికెటర్ రవీంద్ర జడేజాను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది. రివాబా పద్మావత్ వివాదానికి కేంద్రంగా ఉన్న కర్ణి సేనతో చురుకుగా పాల్గొన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థినిగా 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. జడేజా కుటుంబం రాజ్‌కోట్‌లో జడ్డూస్ ఫుడ్ ఫీల్డ్స్ అనే రెస్టారెంట్‌ను, జామ్‌నగర్‌లో ఒక అందమైన ఇంటిని నడుపుతున్నారు. కాగా, రవీంద్ర జడేజా తండ్రి అనిరుధ్‌సిన్హ్ జడేజా, రవీంద్ర జడేజా సోదరి నైనా జడేజా ఇద్దరూ రాజకీయ నాయకులు. గుజరాత్‌లో డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనుండగా, ఫలితాలు డిసెంబర్ 8న వెల్లడికానున్నాయి.

English summary
Gujarat polls 2022: Ravindra Jadeja’s wife Rivaba files nomination from Jamnagar North.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X