షాకింగ్: వేలాది ఆధార్ కార్డులు.. పాడుబడ్డ బావిలో, ఎవరివి.. అసలేం జరిగింది?
ముంబై: ఒకవైపు ఆధార్ నంబర్ అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరిస్తుండగా.. షాకింగ్ ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒక పాడుబడిన బావిలో వేలాది ఒరిజినల్ ఆధార్ కార్డులు దర్శనమివ్వడం కలకలం రేపింది. కార్డులు పాక్షింగా దెబ్బతిన్నప్పటికీ వివరాలు చదవగలిగేలా ఉన్నాయి.
మహారాష్ట్ర యవత్‌మాల్‌లోని షిండేనగర్ ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... తాగునీటికి తీవ్ర కొరత ఏర్పడుతున్న దృష్ట్యా అందుబాటులో ఉన్న నీటి వనరులను ఉపయోగించుకునేందుకు కొంతమంది యువకులు రంగంలోకి దిగారు.
ఈ క్రమంలో షిండేనగర్‌లో ఉన్న ఒక పాడుబడ్డ బావిని బాగు చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ యువకుల ప్రయత్నాన్ని జిల్లా కలెక్టర్ రాజేస్ దేశ్‌ముఖ్ కూడా అభినందించారు. వీరి ప్రయత్నంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా పాలుపంచుకున్నాయి.

ఈ నేపథ్యంలో ఆ బావిలోని చెత్తను తొలగిస్తుండగా అందరూ విస్తుపోయే సంఘటన జరిగింది. ఆ బావిలో వేలాది ఒరిజినల్ ఆధార్‌కార్డులున్న గోనెసంచులు బయటపడ్డాయి. నైలాన్ గోనె సంచుల్లో ప్యాక్ చేసి, రాళ్లు కట్టి మరీ వాటిని ఆ బావిలో పారవేశారు.
వాటిని చూడగానే అవాక్కయిన అధికారులు వెంటనే విచారణకు ఆదేశించారు. దీనిపై దర్యాప్తు కోసం ఒక కమిటీని కూడా వేశామని, పూర్తి నివేదిక అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఉన్నతాధికారులు చెబుతున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications