కుప్పకూలిన అపార్ట్‌మెంట్ పైకప్పు: ఇద్దరు మృతి, శిథిలాల్లో పలువురు, కొనసాగుతున్న సహాయక చర్యలు
న్యూఢిల్లీ: హర్యానాలోని గురుగ్రాంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గురుగ్రామ్‌లోని అపార్ట్‌మెంట్ పైకప్పు గురువారం సాయంత్రం కూలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరికొందరు శిథిలాల్లో చిక్కుకుపోయారని అధికారులు మీడియాకు తెలిపారు.
ఏఎన్ఐ నివేదికల ప్రకారం, గురుగ్రామ్‌లోని సెక్టార్ 109లోని చింటెల్స్ ప్యారడిసో హౌసింగ్ కాంప్లెక్స్‌లో ఈ సంఘటన జరిగింది, ఇక్కడ హౌసింగ్ కాంప్లెక్స్ డీ టవర్ ఆరవ అంతస్తు పైకప్పు భాగం కూలిపోయింది.
ప్రాథమిక నివేదికల ప్రకారం, నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ (NDRF) బృందం, స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ (SDRF) మరియు ఫైర్ టెండర్లు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఈ ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. అందరి భద్రత కోసం ప్రార్థిస్తున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు.
"గురుగ్రామ్‌లోని ప్యారడిసో హౌసింగ్ కాంప్లెక్స్ వద్ద అపార్ట్‌మెంట్ పైకప్పు దురదృష్టవశాత్తు కూలిపోవడంతో అడ్మినిస్ట్రేటివ్ అధికారులు, ఎస్‌డిఆర్‌ఎఫ్, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు రెస్క్యూ, రిలీఫ్ పనుల్లో బిజీగా ఉన్నారు. నేను వ్యక్తిగతంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాను. ప్రతి ఒక్కరి భద్రత కోసం ప్రార్థిస్తున్నాను" అని ఖట్టర్ ట్వీట్ చేశారు.
#WATCH | Haryana: Visuals from Chintels Paradiso housing complex in Gurugram's Sector 109 where a portion of the roof of an apartment has collapsed.
— ANI (@ANI) February 10, 2022
Details awaited. pic.twitter.com/WI22vLwOy6
ఈ సంఘటన గురువారం సాయంత్రం 6:30 గంటలకు జరిగినట్లు నివేదించబడింది. కూలిపోవడం చాలా తీవ్రంగా ఉంది, ఇది మొదటి అంతస్తు వరకు అన్ని పైకప్పులను దెబ్బతీసింది, ప్రాణనష్టం జరిగింది.
"భవనం శిథిలాలలో చిక్కుకున్న వ్యక్తుల సంఖ్య ఇంకా నిర్ధారించబడలేదు, అయితే సుమారు 5-6 మంది చిక్కుకున్నారని మేము అనుమానిస్తున్నాము" అని అగ్నిమాపక శాఖ డిప్యూటీ డైరెక్టర్ గుల్షన్ కల్రా తెలిపారు. చింటెల్స్ ప్యారడిసో హౌసింగ్ కాంప్లెక్స్‌లో మొత్తం 530 ఫ్లాట్‌లు ఉన్నాయి. 400కు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి.












Click it and Unblock the Notifications