గుట్కా మాఫీయాపై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశం
చెన్నై: గుట్కా కుంభకోణం కేసులో సీబీఐతో దర్యాప్తు జరిపించాలని మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గుట్కా విక్రయాలపై విచారణ చేపట్టాలంటూ డీఎంకే ఎమ్మెల్యే అన్బలగళన్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.

ఈ పిల్ విచారించిన జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ అబ్దుల్ ఖురేషీలతో కూడిన హైకోర్టు ధర్మాసనం సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ కుంభకోణంలో శశికళ కుటుంబంతోపాటు మంత్రి భాస్కర్, డీజీపీ రాజేంద్రన్ పాత్రపై అనుమానాలు వ్యక్తం చేసింది.
2017 జులై 8న గుట్కా కంపెనీలపై ఐటి దాడులు జరిగాయి. మద్రాసు హైకోర్టు ఆదేశాలతో తెలుగురాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలలో గుట్కా మాఫియా సీబీఐ దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ నిషేధం ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లోనూ గుట్కా వ్యాపారం యధేచ్ఛగా సాగుతోంది.












Click it and Unblock the Notifications