భారత్ ను భయపెడుతున్న H3N2- జ్వరాలతో మొదలై కరోనా తరహాలో వ్యాప్తి-లక్షణాలివే..!

భారత్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా జ్వరాలు భయపెడుతున్నాయి. వీటికి కారణమవుతున్న హెచ్3ఎన్2 వైరస్ వ్యాప్తి, దాని లక్షణాలు అచ్చు కరోనా తరహాలోనే ఉండటం కలకలం రేపుతోంది.

భారత్ లో రెండేళ్ల క్రితం కరోనా మహమ్మారి రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఆ స్ధాయిలో కాకపోయినా జ్వరాలతో దాని ఉపరకంగా భావిస్తున్న హెచ్3ఎన్2 ( H3N2) వైరస్ రేపుతున్న కల్లోలం రోజురోజుకీ పెరుగుతోంది. దీంతో పలు రాష్ట్రాల్లో వందల సంఖ్యలో జనం దీని బారిన పడుతున్నారు. అచ్చు కరోనా తరహాలోనే ఉన్న దీని లక్షణాలు రోగుల్ని మరింత కలవరపెడుతున్నాయి. దీంతో కేంద్రం కూడా ఇప్పుడు ఐసీఎంఆర్ సాయంతో చికిత్సలపై చర్చిస్తోంది.

 హెచ్3ఎన్2 ఇన్ ఫ్లూయెంజా

హెచ్3ఎన్2 ఇన్ ఫ్లూయెంజా

ప్రస్తుతం భారత్ లో ఎక్కడ చూసినా జ్వరాలు వేధిస్తున్నాయి. సీజన్ మార్పు ప్రభావం అనుకుని మొదట్లో నిర్లక్ష్యం చేసిన జనం, ప్రభుత్వాలు ఇప్పుడు క్రమంగా సీరియస్ గా తీసుకుంటున్నారు. ముఖ్యంగా కరోనాను తలపించేలా వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ ప్రభావం ఇప్పుడు ప్రతీ రాష్ట్రంలో ప్రభుత్వాల్ని భయపెడుతోంది. పలు రాష్ట్రాలు ఇప్పటికే జ్వరాల సర్వేలు చేపట్టాయి. మరికొన్ని రాష్ట్రాలు ఆస్పత్రుల్ని సిద్ధం చేసుకునే పనిలో పడ్డాయి. కేంద్రం కూడా దీని ప్రభావంపై రాష్ట్రాల్ని అప్రమత్తం చేస్తోంది.

 హెచ్3ఎన్2 లక్షణాలు ఇవే..

హెచ్3ఎన్2 లక్షణాలు ఇవే..

అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సీడీఎస్ చెబుతున్న దాని ప్రకారం H3N2 సంక్రమణ లక్షణాలు కాలానుగుణ ఫ్లూ వైరస్‌ల తరహాలోనే ఉంటాయి. జ్వరం, దగ్గు, ముక్కు కారటం వంటి శ్వాసకోశ లక్షణాలు, ఒళ్లు నొప్పులు, వికారం, వాంతులు, అతిసారం వంటి అదనపు లక్షణాలు కూడా ఉండవచ్చని తెలుస్తోంది. గత రెండు మూడు నెలలుగా ఈ వైరస్ పలు ప్రాంతాల్లో విజృంభిస్తోంది. వైరస్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ నెట్‌వర్క్ ద్వారా శ్వాసకోశ వైరస్ వ్యాధులను పర్యవేక్షించే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది ఇతర వైరస్ ఉపరకాల కంటే ఎక్కువ రోగుల్ని ఆస్పత్రి పాలు చేస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదిక వెల్లడించింది.

 ఆరోగ్యవంతులపైనా ప్రభావం

ఆరోగ్యవంతులపైనా ప్రభావం

ఈ తాజా వైరస్ ఆరోగ్యవంతమైన వ్యక్తులలో కూడా వ్యాపిస్తుండటం విశేషం. ఇన్‌ఫ్లుఎంజా వైరస్‌లు ఇన్‌ఫెక్షన్లతో పాటు తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతాయి. ఇది నిమోనియోకు కూడా దారి తీసే అవకాశమున్నట్లు గుర్తించారు. ఇది తీవ్ర అనారోగ్యానికి కారణమవడం, కొన్నిసార్లు మరణానికి కూడా దారితీస్తున్నట్లు గుర్తించారు. ఈ వైరస్ ఇతర స్వైన్ ఇన్‌ఫ్లుఎంజా వైరస్‌ల కంటే పందుల నుండి మనుషులకు సులభంగా సంక్రమించేలా కనిపిస్తుందని అమెరికాలో పరిశోధనా సంస్ధలు చెప్తున్నాయి.
H3N2 వైరస్ పరిణామం చెంది వ్యక్తి నుండి వ్యక్తికి త్వరగా వ్యాపించే అవకాశం ఉందని కూడా తేలింది. 2001 తర్వాత పుట్టిన పిల్లలకు H3N2v వైరస్‌లకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని కూడా కనుగొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+